HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Bjp Cheated By Not Giving Special Status To Ap Kvp

KVP: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసింది: కేవీపీ

  • Author : Balu J Date : 09-02-2024 - 11:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kvp-Jagan
Kvp Jagan

KVP: బీజేపీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని,‌ పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చి మరిచారని  కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ, కేవీపీ రామచంద్ర రావు ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం ఏపీకు తరతరాలుగా తీరని అన్యాయం చేసిందని  అన్నారు. శుక్రవారం నాడు కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ.. ఏపీకు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్నారని.. ఆ హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు.

బీజేపీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని,‌ పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చి మరిచారని ధ్వజమెత్తారు. ఇసుక రవాణా, మద్యంలో వచ్చే ఆర్థిక వనరులు ముఖ్యమంత్రి జగన్‌తో పాటు బీజేపీకు వాటాలు వెళ్తున్నాయని ఆరోపించారు. అన్ని రాష్ట్రాలల్లో మంత్రులు, పెద్ద స్థాయి నేతలు అరెస్టవుతారని.. కానీ ఈడీ, ఇన్ కం టాక్స్, మోదీ దృష్టిలో ఏపీ క్లీన్‌గా ఉందని అన్నారు. ఏపీలో మంత్రులు, అధికారులపై చర్యలకు మోదీ అంగీకరించరని దెప్పిపొడిచారు. మోదీ సహకారం లేకుండా ఏపీ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేయగలదా..? అని కేవీపీ రామచంద్ర రావు ప్రశ్నించారు.

విభజన చట్టంలో హామీలు అమలు కావాలని శక్తికి మించి తాను పోరాడానని తెలిపారు. మోదీ అమరావతికి పవిత్ర జలాలకు బదులు కలుషిత జలాలు తీసుకొచ్చినట్లుందని ఆరోపించారు. వైసీపీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఎవరూ ఏపీకి రాజధాని లేదని మోదీని ప్రశ్నించింది లేదని కేవీపీ రామచంద్ర రావు చెప్పారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap bjp
  • KVP

Related News

AP EAPCET results released

AP EAPCET Results: ఏపీ ఎప్‌సెట్‌ ఫలితాల విడుదల

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఏపీ ఎప్‌సెట్ (AP EAPCET 2026) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 2,76,572 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా… వారిలో 2,58,545 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,82,317 మంది (70.52 శాతం) విద్యా

  • Another investment for AP: Chandrababu secures a massive project.

    AP News: ఏపీలో మరో పెట్టుబడి.. భారీ ప్రాజెక్టు సొంతం చేసుకున్న చంద్రబాబు

Latest News

  • Chandrababu Naidu: రాయలసీమ ఉక్కు కడప స్టీల్ ప్లాంట్‌ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

  • తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC నుంచి మరో నోటిఫికేషన్ విడుదల

  • Parliament Sessions: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం

  • Imran Khan: ‘స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల వాతావరణం లేకపోవడం’ కారణంగా PoK ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని PTI పార్టీ ప్రకటించింది.

  • Gangster Lawrence Bishnoi: సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటన ప్రధాన సూత్రధారి బిష్ణోయ్ ముంబై కోర్టులో లొంగిపోవడానికి ప్రయత్నించాడు.

Trending News

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd