HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Bandi Sanjay Meets Mlc Kavita At Funtion In Nizamabad

Nizamabad: అరుదైన దృశ్యం.. బండి, కవిత ఆత్మీయ పలకరింపు

తెలంగాణాలో అధికార పార్టీ బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తెలంగాణలో ప్రధాన పక్షంగా చెప్పుకునే బండి సంజయ్ నిత్యం కెసిఆర్ పరిపాలనను ఎండగడుతూ ఉంటాడు

  • Author : Vamsi Chowdary Korata Date : 31-05-2023 - 5:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nizamabad
New Web Story Copy 2023 05 31t171244.164

Nizamabad: తెలంగాణాలో అధికార పార్టీ బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకునే బండి సంజయ్ నిత్యం కెసిఆర్ పరిపాలనను ఎండగడుతూ ఉంటాడు. అయితే తాజాగా అరుదైన రాజకీయ దృశ్యం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ రోజు నిజామాబాదులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఇద్దరు ఆత్మీయంగా పలకరించుకుని చిరునవ్వుతో కనిపించారు. ఈ దృశ్యం నిజంగా పలువురిని ఆకట్టుకుంటుంది. రాజకీయంగా ప్రత్యర్థులే అయినప్పటికీ వ్యక్తిగతంగా తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని ఈ రోజు వారు నీరుపించారు.

బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్య నిజామాబాద్‌లో కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. అయితే గృహప్రవేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కల్వకుంట్ల కవితను ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండి, కవిత ఒకే సమయానికి గృహప్రవేశానికి హాజరయ్యారు. దీంతో ఇరువురు నేతలూ పరస్పరం తారసపడ్డారు. ఉప్పు, నిప్పులా కనిపించే వీరిద్దరూ ఆత్మీయంగా పలకరించుకోవడం అందర్నీ ఆకట్టుకుంది. ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తన వెంట వచ్చిన బీఆర్ఎస్ నేతలను ఎమ్మెల్సీ కవిత బండి సంజయ్‌ కు పరిచయం చేశారు. అనంతరం కవిత లోపలి వెళ్లగా.. బండి బయట కార్యకర్తలతో మాట్లాడుతూ ఉన్నారు.

Read More: Raw Mangoes: పచ్చి మామిడికాయతో క్యాన్సర్ కు చెక్ పెట్టండిలా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • MLC Kavita
  • nizamabad
  • rare meeting
  • telangana politics

Related News

A techie who gave up the American dream... today, she is a role model for many farmers. So, who is Sanjana Reddy? What is this interesting story?

Sanjana Reddy Inspiring Journey: అమెరికన్ కలను వదులుకున్న టెక్కీ… నేడు ఆమె ఎందరో రైతులకు ఆదర్శం.. ఇంతకీ సంజన రెడ్డి ఎవరు? ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ

తెలంగాణకు చెందిన సంజన రెడ్డి, తన గ్రామంలోని రైతులకు సాధికారత కల్పించేందుకు అమెరికాలోని ఐటీ ఉద్యోగాన్ని తిరస్కరించారు. ఆమె తనకున్న పరిజ్ఞానాన్ని పసుపు సాగు, అమ్మకాలను మెరుగుపరచడానికి ఉపయోగించారు. రైతులను నేరుగా వినియోగదారులతో అనుసంధానించే ‘ఇందూరు ఫార్మ్స్’ను రెడ్డి స్థాపించారు. ఈ సంస్థ రైతులకు మెరుగైన రాబడిని, కొనుగోలుదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తుంది.

    Latest News

    • Lakshmi Devi: ఈ వస్తువులను మీ ఇంట్లోని పూజ గదిలో పెడితే చాలు.. లక్ష్మీ అనుగ్రహం కలగడం ఖాయం!

    • Karumuri Sunil: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు.. మాజీ మంత్రి కారుమూరి కొడుకు అరెస్ట్

    • Save The Tigers 3 Review: సేవ్ ది టైగర్స్ 3 రివ్యూ

    • ISIకి పూర్తి స్వేచ్ఛ.. పార్లమెంట్‌పై ప్రభావం.. ఇమ్రాన్ ఖాన్ పై పాకిస్థాన్ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు

    • Visakhapatnam: విశాఖ గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం.. పటాకుల దుకాణంలో ఎగిసిపడుతున్న మంటలు!

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd