HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Balapur Ganesh Laddu Sets Record Price How Many Lakhs This Time

Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

ఈ వేలంలో కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్‌ గౌడ్ విజేతగా నిలిచారు. ఆయన అత్యధిక ధరకు లడ్డూను దక్కించుకోవడంతో బాలాపూర్‌ ఉత్సవ కమిటీ ఆయనను ఘనంగా సన్మానించింది. గత ఏడాది రూ.30.01 లక్షలకు పలికిన ఈ లడ్డూ, ఈసారి రూ.4.99 లక్షలు అధికంగా ధరను సాధించింది. ఇది ఇప్పటివరకు బాలాపూర్‌ లడ్డూ చరిత్రలో రెండో అత్యధిక ధర కావడం విశేషం.

  • Author : Latha Suma Date : 06-09-2025 - 11:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Balapur Ganesh Laddu sets record price..how many lakhs this time..?
Balapur Ganesh Laddu sets record price..how many lakhs this time..?

Balapur laddu : ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించే బాలాపూర్‌ గణేశ్ లడ్డూ ఈ ఏడాది మరోసారి రికార్డు స్థాయిలో వేలం దక్కించుకుని వార్తల్లో నిలిచింది. గణేశ్ నవరాత్రుల ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ లడ్డూ, 2025లో ఏకంగా రూ.35 లక్షలకు పలికింది. ఈ వేలంలో కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్‌ గౌడ్ విజేతగా నిలిచారు. ఆయన అత్యధిక ధరకు లడ్డూను దక్కించుకోవడంతో బాలాపూర్‌ ఉత్సవ కమిటీ ఆయనను ఘనంగా సన్మానించింది. గత ఏడాది రూ.30.01 లక్షలకు పలికిన ఈ లడ్డూ, ఈసారి రూ.4.99 లక్షలు అధికంగా ధరను సాధించింది. ఇది ఇప్పటివరకు బాలాపూర్‌ లడ్డూ చరిత్రలో రెండో అత్యధిక ధర కావడం విశేషం.

Read Also: PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

ప్రతీ ఏడాదిలా ఈసారి కూడా వేలానికి ప్రజల్లో భారీ ఆసక్తి కనిపించింది. మొత్తంగా 38 మంది వేలంలో పాల్గొనడానికి తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఉదయం ప్రారంభమైన ఈ వేలం, పెద్ద ఎత్తున హరివేణుల మధ్య కొనసాగింది. ఎప్పటికప్పుడు ధర పెరుగుతుండటంతో ఉత్సాహం ఊపందుకుంది. చివరకు లింగాల దశరథ్‌ గౌడ్ రూ.35 లక్షలతో గణేశుడి ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు. బాలాపూర్‌ గణేశ్ ఉత్సవాలకు ఇది ఒక సంప్రదాయమైంది. ఇక్కడి లడ్డూ వేలం కేవలం ఆర్థిక అంశంగా కాకుండా, ఆధ్యాత్మిక విశ్వాసంగా ప్రజలలో ప్రాచుర్యం పొందింది. ఈ లడ్డూను తీసుకెళ్లి భక్తులు తమ ఇంట్లో లేదా వ్యవసాయ భూముల్లో చల్లుతారు. దీని ద్వారా శాంతి, ఐశ్వర్యం లభిస్తుందని నమ్మకం. ఇక, బాలాపూర్‌ నుండి ప్రారంభమయ్యే గణేశ్ శోభాయాత్ర నగరమంతా వేడుకలతో ఉత్సాహభరితంగా సాగనుంది. ఈ లడ్డూ వేలం గణేశ్ ఉత్సవాల్లో ప్రారంభ ఘట్టంగా పరిగణించబడుతుంది. ఇంతటి గొప్ప సమర్పణతో బాలాపూర్‌ గణేశ్ లడ్డూ మళ్లీ ప్రజల భక్తి, ఆసక్తులకు కేంద్ర బిందువిగా మారింది.

కాగా, గతేడాది స్థానికుడైన కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి 30 లక్షల 1000 రూపాయలకు లడ్డూను సొంతం చేసుకున్నాడు.  ఈ ఏడాదితో బాలాపూర్ గణేష్‌ లడ్డూ వేలంపాట 31 ఏళ్లు పూర్తి చేసుకుంది. బాలాపూర్ లడ్డూవేలాన్ని తొలిసారిగా 1994లో నిర్వహించారు. తొలిసారి బాలాపూర్‌ గ్రామానికే చెందిన కొలను మోహన్ రెడ్డి రూ.450కు లంబోదరుడిని లడ్డూ దక్కించుకున్నాడు. ఆ తర్వాత ప్రతి ఏడాది రికార్డు ధరలు పలుకుతూ లడ్డూ ప్రసాదం రూ.వందల నుంచి రూ.లక్షలకు చేరింది. ప్రస్తుతం రూ. 35 లక్షలకు చేరుకుంది. కాగా, బాలాపూర్ లడ్డూ కోసం గత ఆరేళ్లుగా వేలంలో పాల్గొంటున్నట్ల దశరథ్ గౌడ్ వెల్లడించారు. ఈసారి వేలంలో లడ్డూ దక్కించుకోవటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఆ భగవంతుడి దయ వల్లే తాను ఈసారి లడ్డూ దక్కించుకున్నట్లు తెలిపారు.

Read Also: Khairatabad Ganesh : గంగమ్మ ఒడికి బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Balapur Festival Committee
  • Balapur laddu auction
  • Ganesha Chavithi
  • hyderabad
  • Lingala Dasharath Gowda

Related News

Former Badminton Player Jwala Gutta Donates 60 Liters of Breast Milk

Gutta Jwala: 60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన మాజీ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాల

మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల ఒక గొప్ప మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ప్రసవం తర్వాత తన మొదటి సంవత్సరంలో దాదాపు 60 లీటర్ల తల్లిపాలను హైదరాబాద్, చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రులకు విరాళంగా ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. ఈ చర్య ద్వారా మాతా శిశు ఆరోగ్యం, తల్లిపాల దానం ప్రాముఖ్యతపై ఒక ముఖ్యమైన చర్చకు ఆమె శ్రీకారం చుట్టారు. ఈ విషయంపై ‘ఎక్స్’ సోషల్ మీడియాలో ఆమె ఒక పోస

  • Water Woes in Hyderabad Demand for Water Tankers Rises

    హైదరాబాద్‌లో నీటి కష్టాలు.. వాటర్‌ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్‌

  • H-1B visa delays: Amazon offers temporary relief to Indian employees

    Amazon : తెలుగు రాష్ట్రాల్లో అమేజాన్ బజార్ సరికొత్త రికార్డు

  • International Thalassemia Day

    Nara Bhuvaneswari: ‘తలసేమియా రన్’ వ్యాధిపై అవగాహన కల్పించి చిన్నారులు అండగా నిలవాలని నారా భువనేశ్వరి

Latest News

  • Relationship: ఎప్పుడూ తాగి ఉండే భర్తతో ఎలా ఉండాలి?

  • Kavith-KCR: కేసీఆర్‌ టార్గెట్‌గా.. కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు

  • High BP: హై బీపీ అంటే ఏమిటి? దీని వల్ల శరీరానికి ఎలాంటి హాని కలుగుతుంది?

  • Lord Shani: ఈ ఏడాది శని జయంతి ఎప్పుడు? ఎలాంటి పనులు చేయాలి? పూజా విధానం ఇదే!

  • AMCA Fighter Jet Project: పుట్టపర్తిలో AMCA ప్రాజెక్టు శంకుస్థాపన

Trending News

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

    • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

    • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • TVK విజయ్‌ అను నేను..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd