Atiq Murder Case: సీబీఐ చేతికి అతిక్ మర్డర్ కేసు?
ఉత్తరప్రదేశ్ లో 2017 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్ కౌంటర్లపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. క్రిమినల్, రాజకీయ నేత అతిక్, అతని సోదరుడు
- By Praveen Aluthuru Published Date - 01:37 PM, Mon - 17 April 23

Atiq Murder Case: ఉత్తరప్రదేశ్ లో 2017 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్ కౌంటర్లపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. క్రిమినల్, రాజకీయ నేత అతిక్, అతని సోదరుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసుల ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జైలు నుంచి మెడికల్ చెకప్ కోసం వెళ్లే క్రమంలో మీడియాతో మాట్లాడుతుండగా… దుండగులు జర్నలిస్టుల మధ్య చేరి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతిక్, మరియు సోదరుడు అష్రఫ్ అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఈ కేసుపై ఇప్పటికే దర్యాప్తుకు ఆదేశించింది సుప్రీం కోర్టు. తాజాగా ఇదే కేసుపై న్యాయవాది, మరియు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుప్రీంలో కేసు వేశారు.
యూపీలో దారుణ హత్యకు గురైన అతిక్ అహ్మద్ ,అతని సోదరుడు అష్రఫ్ హత్యకు సంబంధించి. సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. హత్య కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్‌లో సుప్రీంకోర్టును కోరారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
అతిక్ అహ్మద్ హత్య కేసుకు సంబంధించి అంతకుముందే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని పిటిషన్‌లో డిమాండ్ చేశారు. 2017 తర్వాత యూపీలో జరిగిన అన్ని ఎన్‌కౌంటర్లపై కూడా విచారణ జరిపించాలని న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌లో కోరారు.
ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని లాయర్ అన్నారు:
అతిక్, అతని సోదరుడు అష్రఫ్‌ల హత్యపై ప్రత్యేక కమిటీ వేసి దర్యాప్తు చేయాలని మరో న్యాయవాది విశాల్ తివారీ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. పోలీసు ఎన్‌కౌంటర్ ప్రజాస్వామ్యంతో పాటు చట్టబద్ధమైనది కాదంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు.
కాగా గత హత్యను ఎన్ కౌంటర్ గా భావిస్తున్నారు కొందరు. ఈ హత్యలు ప్రభుత్వ హత్యలుగా చూస్తున్నారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత ఆరేళ్లలో 183 మంది క్రిమినల్స్ ఎన్‌కౌంటర్లో పోయారని ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు.
Read More: Pooja Hegde Trolling: ఇఫ్తార్ పార్టీలో పూజహెగ్డే ఎక్స్ పోజింగ్.. ట్రోలింగ్స్ కు దిగిన నెటిజన్స్!