Pooja Hegde Trolling: ఇఫ్తార్ పార్టీలో పూజహెగ్డే ఎక్స్ పోజింగ్.. ట్రోలింగ్స్ కు దిగిన నెటిజన్స్!
చీర ధరించినా, బికినీ (Bikini) వేసుకున్నా సెక్స్ అప్పీల్ తో అభిమానులను మంత్ర ముగ్ధులను చేస్తోంది పూజాహెగ్డే.
- By Balu J Published Date - 12:45 PM, Mon - 17 April 23

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) రోజుకో వెరైటీ డ్రస్సుతో అభిమానులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. చీర ధరించినా, బికినీ (Bikini) వేసుకున్నా సెక్స్ అప్పీల్ తో అభిమానులను మంత్ర ముగ్ధులను చేస్తోంది. అయితే ఈ బ్యూటీ పబ్లిక్ ఫంక్షన్లలో తన అందాలను ప్రదర్శించడానికి వెనుకాడదు. అయితే ఇటీవల జరిగిన ఇఫ్తార్ వేడుకల్లో పూజాహెగ్డే పాల్గొంది. ఎక్కడైనా ఇప్తార్ (Iftaar) విందు జరిగితే ఎవరైనా సాంప్రదాయ దుస్తుల్లో గౌరవ ప్రదమైన దుస్తుల్లో కనిపిస్తారు.
కానీ పూజాహెగ్డే (Pooja Hegde) మాత్రం ఇందుకు భిన్నంగా కనిపించి విమర్శలపాలైంది. ముంబైలో జరిగిన ఓ ఇఫ్తార్ విందులో తన అందాలను ప్రదర్శించేలా చీరకట్టుతో దర్శనమిచ్చింది. బ్లాక్ కలర్ షారీలో డిప్ నెక్ (Deep Neck) అందాలను ప్రదర్శిస్తూ బ్యాక్‌లెస్ (Back Less) బ్లౌజ్ ధరించి అందరి అటెన్షన్ దెబ్బతినేలా చేసింది. ఇఫ్తార్ విందులో బోల్డ్ గా కనిపించడంతో నెటిజన్స్ ఘోరంగా రియాక్ట్ అయ్యారు. ఇది ఇఫ్తార్ విందు అని, డాన్స్ పార్టీ కాదని నెటిజన్స్ ట్రోల్లింగ్ (Trolling) కు దిగారు. ప్రస్తుతం పూజాహెగ్గే వీడియోలు, ఫోటోలు సోసల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దేశంలో ఎక్కడా చూసినా రంజాన్ (Ramjan) శోభ సంతరించుకుంది. ఈ మాసంలో ముస్లింల ప్రార్థనలు, ఉపావాసాలతో నిత్యం సందడి నెలకొంటుంది. ఇక ఇఫార్త్ విందుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరసరమే ఉండదు. పిల్లల నుంచి పెద్దల వరకు ఇఫ్తార్ విందులో పాల్గొంటూ మత సామరస్యాన్ని చాటుకుంటారు. ఇక హిందువులు హాజరై సోదరాభావాన్ని చాటుకుంటుంటారు. ఈ వేడుకలకు సెలబ్రిటీలు (Celebraties) సైతం హాజరవుతూ ఉంటారు.
Also Read: Vikram’s Thangalaan: తంగలాన్ క్రేజీ అప్ డేట్.. ఉత్కంఠ రేపుతున్న విక్రమ్ లుక్!