Putin : రష్యా అధ్యక్షుడిపై హత్యాయత్నం..?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోంది.
- Author : hashtagu
Date : 15-09-2022 - 7:43 IST
Published By : Hashtagu Telugu Desk
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోంది. పుతిన్ ప్రయాణిస్తున్న కారుపై బాంబు దాడి జరిగినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదం నుంచి పుతిన్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని యూరో వీక్లీ న్యూస్ అనే మీడియా సంస్థ తెలిపింది. జనరల్ జీవీఆర్ టెలిగ్రామ్ ఛానెల్ ఈ విషయాన్ని ప్రకటించినట్లు వెల్లడించింది.
పుతిన్ తన నివాసానికి తిరిగివస్తుండగా…ఆయన ప్రయాణిస్తున్న కారు ఎడమచక్రం భారీ శబ్దంతో పేలియిపోయింది. వాహనం నుంచి పొగలు రావడంతో భద్రతా సిబ్బంది ఆయన వాహనాన్ని అక్కడి నుంచి సురక్షితంగా తరలించినట్లు పేర్కొంది. మరో కాన్వాయ్ లో పుతిన్ను అధ్యక్ష భవనానికి తరలించారు. కొన్ని నెలల క్రితం కూడా పుతిన్ పై హత్యాయత్నం జరిగినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఈ విషయాన్ని రష్యా రహస్యంగా ఉంచినట్లు పేర్కొంది.