Assam Floods: అస్సాంలో కుండపోత… ఆరెంజ్ అలర్ట్
ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా అనేక రాష్ట్రాలు వరదల్లో చిక్కుకున్నాయి.
- By Praveen Aluthuru Published Date - 04:28 PM, Sat - 24 June 23

Assam Floods: ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా అనేక రాష్ట్రాలు వరదల్లో చిక్కుకున్నాయి. భారీ వర్షాల కారణంగా ఈ ఏడాది మొదటగా అస్సాం తీవ్రంగా ప్రభావితమైంది. ప్రస్తుతం అస్సాంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నిజానికి అస్సాంలో ప్రతి ఏడాది భారీ వర్షపాతం నమోదవుతుంది. దీని వల్ల లక్షల మంది ప్రజలు నష్టపోతున్నారు. ప్రస్తుతం వర్షాల కారణంగా రాష్ట్రంలోని దాదాపు 18 జిల్లాలు తీవ్ర వరదల్లో చిక్కుకున్నాయి. ఈ ప్రాంతాల్లో వరదల కారణంగా 30 వేల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు.
నిజానికి దేశంలో రుతుపవనాలు చాలా ఆలస్యంగా ప్రవేశించాయి. కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు సరిగ్గా ప్రారంభం కూడా కాలేదు కానీ అస్సాంలో ప్రజలు ఇప్పటికే సమస్యలను ఎదుర్కొంటున్నారు. భారత వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం రాబోయే రోజుల్లో భారీ వర్షాలు మరియు తుఫానులను అంచనా వేసింది. రాష్ట్రంలోని 7 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.
Read More: Sahasra Chandra Darshan : సహస్ర చంద్ర దర్శనం.. లైఫ్ లో వెయ్యి పౌర్ణముల విశిష్టత