Asaduddin Owaisi: ఢిల్లీలోని ఒవైసి ఇంటిపై దాడి..తలుపు అద్దాలు ధ్వంసం
ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దుండగులు దాడికి యత్నించారు. ఢిల్లీలోని అతని నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు.
- By Praveen Aluthuru Published Date - 11:17 AM, Mon - 14 August 23

Asaduddin Owaisi: ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దుండగులు దాడికి యత్నించారు. ఢిల్లీలోని అతని నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. దీంతో ఇంటి తలుపులకు అమర్చిన అద్దాలు పగిలిపోయాయి. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు ఒవైసీ ఇంటికి వచ్చి ఆరా తీశారు. పరిసర ప్రాంతంలో రాళ్లు కూడా లేవని తెలిపారు. దేశ రాజధానిలోని తన నివాసంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేయడం ఇది నాలుగో సారి. 2014 లో కూడా అతనిపై ఇంటిపై దాడి జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. చుట్టుప్రక్కల వారిని అరా తీస్తున్నారు. పరిసర ప్రాంతంలో సీసీ ఫుటేజీని తెప్పించుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా స్వాతంత్ర దినోత్సవానికి ముందు దాడి జరగడంపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Bulldozers demolish : గాంధీ వారసత్వ సంపద ను కూల్చేసిన బిజెపి సర్కార్…