Finland Bridge Collapse: ఫిన్లాండ్ లో వంతెన కూలి 27 మంది గాయపడ్డారు
ఫిన్లాండ్ లోని ఫిన్నిష్ నగరంలో వంతెన కూలిపోయింది. ఈ ప్రమాద ఘటనలో 27 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నట్లు స్థానికుల సమాచారం
- By Praveen Aluthuru Published Date - 03:53 PM, Thu - 11 May 23

Finland Bridge Collapse: ఫిన్లాండ్ లోని ఫిన్నిష్ నగరంలో వంతెన కూలిపోయింది. ఈ ప్రమాద ఘటనలో 27 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నట్లు స్థానికుల సమాచారం. గాయపడిన వారిలో పలువురు పాఠశాల విద్యార్థులు ఉన్నారని హెల్సింకి హాస్పిటల్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంఘటనను హెల్సింకి ప్రాంతీయ రెస్క్యూ సర్వీస్ ప్రతినిధి నివేదించారు.
27 injured in Finland, mostly children, as footbridge collapses reports AFP quoting rescuers.
— ANI (@ANI) May 11, 2023
ఎస్పూ టాపియోలా ప్రాంతంలో నిర్మాణ స్థలాన్ని దాటుతున్న సమయంలో వంతెన కూలిపోయిందని పోలీసులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదని, కానీ 24 మంది గాయపడ్డట్టు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Read More: Pomegranate: దానిమ్మతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాకవ్వాల్సిందే?