News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Speed-news News
  • ⁄Ap Youth Sentenced To Death For Killing Girl Who Rejected His Advances

Death Sentence: రమ్య హంతకుడికి ఉరిశిక్ష!

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసుపై నేడు కోర్టు తీర్పు వెలువరించింది.

  • By Balu J Updated On - 05:18 PM, Fri - 29 April 22
Death Sentence: రమ్య హంతకుడికి ఉరిశిక్ష!

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసుపై నేడు కోర్టు తీర్పు వెలువరించింది. ఈమేరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు హంతకుడికి ఉరిశిక్ష విధించింది. గతేడాది ఆగస్టు 15న రమ్య హత్య జరగ్గా… డిసెంబర్‌లో విచారణ ప్రారంభమైంది. ఈనెల 26న కేసు విచారణ ముగిసింది. నేడు గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై సీఎం జగన్, టీడీపీ నేత నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.  గుంటూరు పరమయ్యకుంటకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యోదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సామాజిక మాధ్యమం ద్వారా పరిచయమైన కుంచాల శశికృష్ణ ప్రేమ పేరుతో రమ్యని వేధించాడు. తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టిందన్న కోపంతో గతేడాది ఆగస్టు 15న నడిరోడ్డుపైన అందరూ చూస్తుండగా రమ్యను కత్తితో పొడిచి హత్య చేశాడు.

శశికృష్ణకు ఉరిశిక్ష

సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన కుంచాల శశికృష్ణ ప్రేమ పేరుతో రమ్యని వేధించాడు. తన ప్రేమ కాదన్నదన్న కోపంతో గత ఏడాది ఆగస్ట్ 15వ తేదిన పబ్లిగ్గా నడిరోడ్డుపై రమ్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. హత్య విజువల్స్ సిసి కెమెరాలో రికార్డయ్యాయి. అదే కేసులో ప్రధాన సాక్షిగా నిలిచింది. హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేయటంతో పాటు 15 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేశారు. రమ్య శరీరంపై 8 కత్తిపోట్లను వైద్యులు గుర్తించారు . సాక్షాధారాలు లభించటంతో పాటు ప్రత్యక్షంగా హత్య చూసిన వారు కూడా విచారణకు సహకరించారు. ప్రత్యేక కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.శారదామణి వాదించారు. నిందితుడు శశికృష్ణ గుంటూర్ జైల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో హంతకుడికి ఉరిశిక్ష విధించింది కోర్టు.

అంతటా ఉత్కంఠత

ఈ ఘటనపై రాజకీయ పార్టీలు సైతం ఆందోళనలు చేశాయి. సీసీ కెమెరాలో నమోదైన హత్య దృశ్యాల ఆధారంగా శశికృష్ణను 24 గంటల్లోనే నరసరావుపేట సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్వంలో పోలీసులు 36 మందిని విచారించి 15రోజుల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.శారదామణి 28మందిని విచారించగా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాంగోపాల్ వద్ద సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. హత్య కేసులో కీలకమైన సీసీ టీవీ వీడియోను పరిశీలించిన న్యాయమూర్తి ఇరువర్గాల వాదనలు విని ఈనెల 26న విచారణ పూర్తి చేశారు. తీర్పును రిజర్వు చేసిన న్యాయస్థానం ఈ నెల 29న తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది. రమ్య హత్య కేసుపై జాతీయ ఎస్సీ కమిషన్ కూడా క్షేత్రస్థాయిలో విచారణ జరిపింది. ఏపీలోని దిశా చట్టం ఎట్టకేలకు హంతకుడికి ఏడాది తిరగకముందే ఈ శిక్ష వేసేలా చేయడం పట్ల సర్వత్రా చర్చనీయాంశమైంది.

విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నాను. ఈ కేసు విషయంలో వేగంగా దర్యాప్తు పూర్తిచేసి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ శాఖకు అభినందనలు.

— YS Jagan Mohan Reddy (@ysjagan) April 29, 2022

చెల్లెలు రమ్యని అంతమొందించిన మానవ మృగం శశికృష్ణకి కోర్టు ఉరిశిక్ష విధించడాన్ని స్వాగతిస్తున్నాను. రమ్య హంతకుడిని శిక్షించాలని నేను ఆందోళనకి దిగితే…మాపై దాడులు చేసి రివర్స్ కేసులు బనాయించింది ఈ సర్కారు.(1/2) pic.twitter.com/w9HaqN8VOJ

— Lokesh Nara (@naralokesh) April 29, 2022

Tags  

  • andhra pradesh
  • ap highcourt
  • Guntur District
  • murder

Related News

RK Roja: రోజాకు వింత అనుభవం!

RK Roja: రోజాకు వింత అనుభవం!

పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె. రోజా తన అసెంబ్లీ నియోజకవర్గంలో గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • Andhra Woman: వివాహేతర సంబంధం.. మహిళా వాలంటీర్ హత్య!

    Andhra Woman: వివాహేతర సంబంధం.. మహిళా వాలంటీర్ హత్య!

  • Disha App: ‘దిశ’ యాప్ కు బిగ్ రెస్పాన్స్!

    Disha App: ‘దిశ’ యాప్ కు బిగ్ రెస్పాన్స్!

  • Chicken Prices: ఏపీలో కొండెక్కిన ‘కోడి’

    Chicken Prices: ఏపీలో కొండెక్కిన ‘కోడి’

  • CM Jagan Failures: ‘జగన్‌ పాలనలో ఊరికో ఉన్మాది-2’

    CM Jagan Failures: ‘జగన్‌ పాలనలో ఊరికో ఉన్మాది-2’

Latest News

  • IPS Transfers : జ‌గ‌న్ మార్క్ పోలీస్ బ‌దిలీలు

  • TS Gets New Chief Justice:తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ.. కొత్త చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భుయాన్

  • AP Teachers : స‌మ్మె దిశ‌గా ఏపీ టీచ‌ర్లు

  • SA vs Ind: భారత్‌తో సీరీస్ కు సఫారీ టీమ్ ఇదే

  • Virus In SmartPhone: మీ స్మార్ట్ ఫోన్‌కు వైరస్ సోకకుండా ఇలా జాగ్రత్త పడండి…లేకపోతే హ్యాకర్ల చేతిలో మీ పని గోవిందా…?

Trending

    • Googled questions on Sex: గూగుల్ లో శృంగారం గురించి పబ్లిక్ ఎక్కువగా వెతికే టాపిక్స్ ఇవే…

    • Love From Cannes: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దీపికా సందడి…నెట్టింట్లో వీడియో వైరల్..!!

    • Putin Health: రష్యాలో తీవ్ర కలకలం, పుతిన్ ఆరోగ్య పరిస్థితి విషమం.!!

    • Menstual Leave: ఇకపై ఆ దేశంలో మహిళలకు నెలకు మూడు రోజుల పీరియడ్ లీవ్…

    • Bajrang Dal Weapons: కర్నాటకలో మరో వివాదం…ఎయిర్ గన్స్ తో బజరంగ్ దళ్ కార్యకర్తలకు ట్రైనింగ్..!!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: