TDP Greeshma : ఏపీలో ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చేశారు – టీడీపీ అధికార ప్రతినిధి గ్రీష్మ
ఏపీలో ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చారని టీడీపీ అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ ఆరోపించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని...
- Author : Prasad
Date : 27-11-2022 - 1:40 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చారని టీడీపీ అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ ఆరోపించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలంటారని… కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం వల్ల మన రాష్ట్రానికి ఆరోగ్యం లేదని… భాగ్యమూ లేదన్నారు. మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో వైద్య రంగాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించారన్నారు. నాడు-నేడు కింద వైద్యరంగంలో విప్లవం తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెబుతున్న మాటలు ఆచరణలో అమలు కాక పేదలు వైద్యం కోసం నానా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఏపీ వైద్య విధానం దేశానికే ఆదర్శమని పచ్చి అబద్ధాలు చెబుతున్న ఆరోగ్యశాఖమంత్రి విడదల రజనీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వాసుపత్రులను పరిశీలిస్తే వాస్తవ పరిస్థితులు కళ్లక కడతాయన్నారు. ప్రజారోగ్యాన్ని ఉద్ధరించినట్టు ప్రచారార్భాటం చేసుకుంటున్న మంత్రి విడదల రజనీ మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.