AP Minister: వచ్చే రెండున్నరేళ్లల్లో అమరావతిని పూర్తిచేస్తాం!
- By Balu J Published Date - 11:54 PM, Fri - 14 June 24

AP Minister: వచ్చే రెండున్నరేళ్లల్లో అమరావతి నిర్మాణాన్ని పూర్తిచేస్తామని ఏపీ కొత్త మినిస్టర్ నారాయణ అన్నారు. రాజధాని నిర్మాణం కోసం 58 రోజుల్లో 33 వేల ఎకరాలు ఇచ్చారని, గడిచిన ఐదేళ్లలో రాజధాని పేరుతో వైసీపీ మూడు ముక్కలాట ఆడిందని ఆయన మండిపడ్డారు. అమరావతి నిర్మాణాలు 90 శాతం పూర్తి చేశామని, అమరావతి రైతులకు కచ్చితంగా న్యాయం చేస్తామని మంత్రి నారాయణ ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.
ఒక టైం బాండ్ ప్రోగ్రాం పెట్టుకొని అమరావతి నిర్మాణం చేస్తామని, న్యాయపరమైన చిక్కులు రాకుండా అమరావతి నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు. గడిచిన ఐదేళ్లలో మున్సిపల్ శాఖను నిర్వీర్యం చేశారని, వైసీపీ పాలనలో స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త మీద చెత్త పన్ను వేసిన వైసీపీ ప్రభుత్వం అని, చెత్తపన్నుపై సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటాం అని మంత్రి నారాయణ అన్నారు.