HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ap Government Forms New Committee Over Cinema Tickets Price

Andhra Pradesh: సినిమా టికెట్ల ధరలపై కొత్త కమిటీ

  • Author : hashtagu Date : 28-12-2021 - 12:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cinema Hall
Cinema Hall

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల వ్య‌వ‌హారంపై వైసీపీ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇందుకోసం కొత్త క‌మిటీని నియమించనునట్లు అధికారులు మంగళవారం ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ క‌మిటీలో ఉన్న‌తాధికారులు, ఎగ్జిబిట‌ర్లు ఉంటారు.

క‌మిటీలో హోం, రెవెన్యూ, పుర‌పాల‌క‌, ఆర్థిక, స‌మాచార‌, న్యాయ‌శాఖ‌, కృష్ణా జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ కూడా ఉంటార‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. సినిమా థియేట‌ర్ల వ‌ర్గీక‌ర‌ణ‌, ధ‌ర‌ల‌పై క‌మిటీ ప్ర‌తిపాద‌న‌లు చేసి ప్ర‌భుత్వానికి నివేదిక ఇవ్వ‌నున్నారు.

మ‌రోవైపు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం సినిమా టికెట్‌ ధరలు తగ్గించడంపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 35 ప్రకారం టికెట్లు విక్రయిస్తే థియేటర్లు మూసివేయడమే ఉత్తమం అని మీడియాతో అన్నారు. సినిమా థియేటర్లను వాటి యజమానులు స్వచ్ఛందంగా మూసివేస్తుండటంతో వాటిపై ఆధార‌ప‌డ్డ వేలాది మంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని చెప్పారు.

కరోనా విజృంభ‌ణ స‌మ‌యంలో థియేటర్లలో సినిమాల‌ ప్రదర్శన ఆగిపోయిన విష‌యం తెలిసిందేనని, ఇప్పుడిప్పుడే ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వస్తున్నారని అన్నారు. పండుగ‌ల సీజ‌న్‌తో పాటు పెద్ద సినిమాలు విడుద‌ల అవుతుండ‌డంతో మ‌ళ్లీ సినీ ప‌రిశ్ర‌మకు మంచి రోజులు వ‌చ్చాయ‌ని భావించామ‌ని, అయితే, ప్రస్తుతం జగన్ తీసుకున్న నిర్ణయంతో ప‌రిస్థితులు మ‌ళ్లీ ఇబ్బంది పడుతున్నామని థియేట‌ర్ల య‌జ‌మానులు మీడియాకు చెప్పారు.

ఏపీలోని ప్రతి థియేటర్లో ప్ర‌తిరోజు 50 మంది జీవనోపాధి పొందుతున్నారని, వీరంద‌రికీ త‌క్కువ వేత‌నాలు ఉంటాయ‌ని అన్నారు. అలాగే, థియేట‌ర్ల‌లోని స్నాక్స్ వంటివి విక్ర‌యించేవారు కూడా జీవ‌నోపాధిని కోల్పోవాల్సి వ‌స్తోంద‌ని చెప్పారు. మరోపక్క, సినిమా టికెట్ల ధ‌ర‌లు, వాటిల్లో త‌నిఖీలు వంటి అంశాల‌పై నేడు సంబంధిత వ్య‌క్తుల‌తో ఏపీ స‌ర్కారు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP government
  • cinema tickets
  • commitee
  • tollywood

Related News

Ram Charan’s ‘Peddi’ enters the ₹300 crore club.

Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

Ram Charan మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 315 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ నెల 4న ప్ర

    Latest News

    • AP Jobs: ఏపీ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త

    • Kethireddy Pedda Reddy: తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత.. కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్

    • Chandrababu Naidu: కూటమి రెండేళ్ళ పాలనపై భారీ బహిరంగ సభ

    • Raghava Lawrence: రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ క్లారిటీ

    • Khammam: ఖమ్మం సోనోవిజన్ షోరూమ్‌లో భారీ దోపిడీ

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd