HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >High Tension In Tadipatri Ketireddy Pedda Reddy Arrested

Kethireddy Pedda Reddy: తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత.. కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్

  • Author : Vamsi Chowdary Korata Date : 12-06-2026 - 12:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
High tension in Tadipatri... Ketireddy Pedda Reddy arrested.
High tension in Tadipatri... Ketireddy Pedda Reddy arrested.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా… ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను వంచించిందంటూ రాష్ట్రవ్యాప్తంగా ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట వైసీపీ హైకమాండ్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.

ఇందులో భాగంగా తాడిపత్రిలో నిర్వహించతలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నించారు. అయితే, శాంతిభద్రతల సమస్యలను ఉదహరిస్తూ పోలీసులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. కానీ, పోలీసుల హెచ్చరికలను ఖాతరు చేయకుండా పెద్దారెడ్డి వేదిక వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో… పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, పెద్దారెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో వైసీపీ కార్యకర్తలు పోలీసుల వైపు దూసుకురావడంతో… భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు పెద్దారెడ్డిని అనంతపురంకు తరలించారు.

ఘర్షణకు దారితీసిన నేపథ్యం:

ఒకవైపు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట వైసీపీ నిరసనలకు సిద్ధమవగా, మరోవైపు అధికార కూటమి ప్రభుత్వం తాము ఇచ్చిన హామీల అమలును చాటిచెబుతూ రెండేళ్ల పాలనా ఉత్సవాలను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టణంలో భారీ బైక్ ర్యాలీకి పిలుపునిచ్చారు. ఒకే ప్రాంతంలో ఇరు పార్టీలు పరస్పర విరుద్ధ కార్యక్రమాలకు ప్లాన్ చేయడంతో తీవ్ర ఘర్షణ వాతావరణం తలెత్తే అవకాశం ఉందని పోలీసులు భావించారు.

ఈ క్రమంలో, వైసీపీ నిరసన కార్యక్రమానికి ఎలాంటి ముందస్తు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు మొదట పెద్దారెడ్డిని గృహనిర్బంధం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, ఆయన కచ్చితంగా కార్యక్రమంలో పాల్గొంటానని భీష్మించుకోవడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి అనంతపురం తరలించారు. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరగకుండా తాడిపత్రి అంతటా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • Kethireddy Peddareddy
  • Tadipatri
  • Tadipatri Politics
  • YSRCP MLA Arrest

Related News

    Latest News

    • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

    • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

    • Ravana: యూట్యూబర్ రావణ్‌కు బిగ్ షాక్

    • Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు

    • Rain Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక..

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd