AP Assembly: 14వ తేదీ నుంచి అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు
- By Balu J Published Date - 03:43 PM, Fri - 3 March 23

అమరావతి: ఏపీలో ఈ నెల 14వ తేదీ నుంచి అసెంబ్లీ, శాసన మండలి సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. మార్చి 14న ఉదయం 10 గంటల నుంచి ఉభయసభలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి సంబంధించి ఉభయ సభలనూ ఉద్దేశించి 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు.