Indian Student: విదేశాల్లో మరో దారుణం.. ఇండియన్ స్టూడెంట్ ను కాల్చి చంపేశారు
- Author : Balu J
Date : 15-04-2024 - 7:45 IST
Published By : Hashtagu Telugu Desk
Indian Student: ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థులు అనుమానస్పదంగా చనిపోతుండటం కలిచివేస్తోంది. ఇప్పటికే 11 మంది భారతీయ విద్యార్థులు చనిపోయారు. అందులో అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నారు. వరుస ఘటనలతో ఏం జరుగుతుందో తెలియక తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా కెనడాలో కెనడాలోని వాంకోవర్ లో 24 ఏళ్ల భారతీయ విద్యార్థిని కారులో కాల్చి చంపారు.
చిరాగ్ అంటిల్ (24) అనే యువకుడు ఓ వాహనంలో శవమై కనిపించాడని వాంకోవర్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 12న రాత్రి 11 గంటల సమయంలో తుపాకీ కాల్పుల శబ్దం వినిపించడంతో ఈస్ట్ 55వ అవెన్యూ, మెయిన్ స్ట్రీట్ కు అధికారులను పిలిపించారు. చిరాగ్ అంటిల్ (24) అనే యువకుడు ఆ ప్రాంతంలో ఓ వాహనంలో శవమై కనిపించాడు’ అని వాంకోవర్ పోలీసులు తెలిపారు.
ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ ఎన్ ఎస్ యూఐ చీఫ్ వరుణ్ చౌదరి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ట్యాగ్ చేస్తూ విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ‘కెనడాలోని వాంకోవర్ లో చిరాగ్ అంటిల్ అనే భారతీయ విద్యార్థి హత్య కేసును అత్యవసరంగా పరిశీలించాలి. విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరుతున్నాం. ఈ క్లిష్ట సమయంలో మృతుడి కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని కోరారు.