Andhra Pradesh: తిరుమలలో కార్చిచ్చు.. దగ్దమైన శ్రీ గంధం చెట్లు
తిరుమలకు 3 కిలోమీటర్ల దూరంలోని పార్వేటు మండపం సమీపంలోని టీటీడీ అటవీ ప్రాంతంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు.
- Author : Praveen Aluthuru
Date : 19-04-2024 - 4:33 IST
Published By : Hashtagu Telugu Desk
Andhra Pradesh: ఎండలు దంచికొడుతున్నాయి. ఈ ఏడాది కాస్త ముందుగానే మార్చిలోనే వేసవి తాపం మొదలైంది. ఏప్రిల్ లో 40 డిగ్రీలను దాటేస్తుంది. ఇక మే లో భానుడి భగభగలు తప్పవంటున్నారు. ఇదిలా ఉండగా వేడికి అగ్నిప్రమాదాలు సహజమే. అటు అటవీ ప్రాంతాల్లో కూడా కార్చిచ్చు రాజుకుంటుంది. తాజాగా తిరుమల శేషాచలం అడవుల్లో కార్చిచ్చు ఏర్పడింది.
We’re now on WhatsApp. Click to Join
తిరుమలకు సరిగ్గా 3 కిలోమీటర్ల దూరంలోని పార్వేటు మండపం సమీపంలోని టీటీడీ అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. డీఎఫ్‌ఓ, సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, వాటర్ ట్యాంక్‌లతో ఘటనాస్థలికి వెళ్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా అగ్ని ప్రమాదంలో శ్రీ గంధం చెట్లతో సహా అనేక భారీ చెట్లు ధ్వంసమయ్యాయి, అయితే ఈ అగ్ని ప్రమాదానికి కారణం తెలియరాలేదు. అయితే మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు పెరగడమే కారణమని అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు.