Congress List: మరో నలుగురు అభ్యర్థుల్ని ప్రకటించిన కాంగ్రెస్
లోక్‌సభ ఎన్నికలగానూ కాంగ్రెస్ ఈ రోజు సాయంత్రం మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ అభ్యర్థుల జాబితాలో చాలా సీనియర్ల పేర్లు ఉండటం గమనార్హం. కాంగ్రెస్ తాజాగా ప్రకటించిన జాబితాలో మూడు రాష్ట్రాల్లోని నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
- Author : Praveen Aluthuru
Date : 30-04-2024 - 10:36 IST
Published By : Hashtagu Telugu Desk
Congress List: లోక్‌సభ ఎన్నికలగానూ కాంగ్రెస్ ఈ రోజు సాయంత్రం మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ అభ్యర్థుల జాబితాలో చాలా సీనియర్ల పేర్లు ఉండటం గమనార్హం. కాంగ్రెస్ తాజాగా ప్రకటించిన జాబితాలో మూడు రాష్ట్రాల్లోని నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
We’re now on WhatsApp. Click to Join
హర్యానాలోని గురుగ్రామ్ నుంచి ప్రముఖ నటుడు రాజ్‌బబ్బర్ బరిలోకి దిగనున్నాడు. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా సీటుపై సీనియర్ నేత ఆనంద్ శర్మ పోటీకి దిగుతారు. హమీర్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి కేంద్ర మంత్రి, బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్‌పై సత్పాల్ రైజాదాకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. మహారాష్ట్రలోని ముంబై నార్త్ స్థానానికి భూషణ్ పాటిల్ అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్. ఇదిలా ఉండగా యూపీ కాంగ్రెస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్ బబ్బర్ గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని ఫతేపూర్ సిక్రీ స్థానం నుంచి పోటీ చేశారు. రెండు సార్లు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
Also Read: UP : విడాకులు తీసుకున్న కూతురికి బ్యాండ్ మేళంతో స్వాగతం పలికిన తండ్రి