Anagani Satya Prasad : ఈ పథకం ద్వారా ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం పెరుగుతుంది..
Anagani Satya Prasad : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు నారా లోకేష్ చేసిన చర్యలు అభినందనీయమని చెప్పారు. ఈ పథకంతో ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం పెరిగే అవకాశం ఉన్నదని, పాఠశాలల్లో మంచి ఫలితాలు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
- By Kavya Krishna Published Date - 06:17 PM, Sat - 4 January 25

Anagani Satya Prasad : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ఈ రోజు “డొక్కా సీతమ్మ” పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకానికి విజయవాడలో మంత్రి నారా లోకేష్ ప్రారంభోత్సవం ఇచ్చారు. ఆయా జిల్లాలు, నియోజకవర్గాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ పథకాన్ని ప్రారంభించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
బాపట్ల జిల్లాలోని రేపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకూ నేడు నుంచి మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రణాళిక చేపట్టినట్లు ప్రకటించారు.
World Braille Day : లూయిస్ బ్రెయిలీ పుట్టినరోజున ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ పథకానికి శ్రీకారం చుట్టినందుకు ఆయనపై ప్రశంసలు కురిపిస్తూ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు నారా లోకేష్ చేసిన చర్యలు అభినందనీయమని చెప్పారు. ఈ పథకంతో ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం పెరిగే అవకాశం ఉన్నదని, పాఠశాలల్లో మంచి ఫలితాలు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
అనగాని సత్యప్రసాద్ మంత్రి నారా లోకేష్ చేసిన ఈ కార్యక్రమాన్ని “నిర్మాణాత్మక చర్య” అని కొనియాడారు. విద్యార్థులకు మంచి పౌష్టిక ఆహారం అందించడం, ముఖ్యంగా తాము “డొక్కా సీతమ్మ” మధ్యాహ్న భోజన పథకంతో వారి శరీరాభివృద్ధికి దోహదం చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని స్పష్టం చేశారు.
సబ్బవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో “డొక్కా సీతమ్మ” మధ్యాహ్న భోజన పథకాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గండి బాజ్జి పాల్గొన్నారు. పథకాన్ని ప్రారంభించిన అనంతరం, హోం మంత్రి అనిత విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ, ‘‘విద్యార్థులు క్రమశిక్షణతో చదువుల్లో ప్రతిభ చూపాలని’’ కోరారు. ఆయన తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించేందుకు ఎంత కష్టపడుతున్నారని చెప్పారు. ‘‘మా నాన్నే క్రమశిక్షణతో నడిపించారు. ఆయన మాకు ఇచ్చిన ఆస్తి చదువు. ఆ చదువే నాకు రాజకీయాల్లో పెట్టుబడిగా మారింది’’ అని చెప్పారు.
అదే సమయంలో, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు గురించి సానుకూల దృష్టికోణం కలిగి ఉండాలని, పుస్తకాల విలువ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అవగాహన ఉందని హోం మంత్రి తెలిపారు.
Chandrababu Good News: పోలవరం నిర్వాసితులకు సంక్రాంతి పండుగ ముందే