Amitabh Covid: మళ్లీ కరోనా బారినపడిన అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు మళ్లీ కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే నిన్న రాత్రి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
- By Hashtag U Published Date - 06:20 AM, Wed - 24 August 22
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు మళ్లీ కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే నిన్న రాత్రి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవల ఆయనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ‘బిగ్ బి’కి కరోనా సోకిందని తెలిసిన వెంటనే ఆయన అభిమానులు, సినీ తారలు స్పందించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
T 4388 – I have just tested CoViD + positive .. all those that have been in my vicinity and around me, please get yourself checked and tested also .. 🙏
— Amitabh Bachchan (@SrBachchan) August 23, 2022
అమితాబ్ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి 14వ సీజన్ షూటింగ్లో ఉన్నారు. అలాగే ఆయన కీలక పాత్రలో నటించిన ‘బ్రహ్మాస్త్రం’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్, అలియా భట్, నాగార్జున, మౌనిరాయ్ తదితరులు నటిస్తున్నారు. అలాగే ‘గుడ్‌బై’, ‘ఊంచాయ్’ సినిమాల్లో నటిస్తున్నారు. రష్మిక మందన్నతో మరో సినిమాలో కనిపించబోతున్నాడు. కరోనా బారిన పడిన అమితాబ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
అమితాబ్‌కు కరోనా సోకడం ఇది రెండోసారి. రెండేళ్ల క్రితం ఆయనకు కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరి కోలుకున్నారు. అలాగే, అతని కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్ మరియు మనవరాలు ఆరాధ్య కూడా కోవిడ్ నుండి కోలుకున్నారు.
Related News
Vettaiyan: అక్టోబర్ లో ఆ ఇద్దరు హీరోలకు పోటీ ఇవ్వబోతున్న రజనీకాంత్?
టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న 170వ సినిమా వెట్టియాన్. ఇందులో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దసరా విజయన్, రక్షన్ వంటి భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. కాగా ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుంచ�