Amit Shah: నేడు తెలంగాణలో హోం మంత్రి అమిత్ షా పర్యటన.. షెడ్యూల్ ఇదే..!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) నేడు హైదరాబాద్ రానున్నారు. లాల్ బహదూర్ స్టేడియంలో పార్టీ బూత్ ప్రెసిడెంట్లు, ఇతర నేతలనుద్దేశించి షా ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
- Author : Gopichand
Date : 12-03-2024 - 8:40 IST
Published By : Hashtagu Telugu Desk
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) నేడు హైదరాబాద్ రానున్నారు. లాల్ బహదూర్ స్టేడియంలో పార్టీ బూత్ ప్రెసిడెంట్లు, ఇతర నేతలనుద్దేశించి షా ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. తన పర్యటన సందర్భంగా బీజేపీ సోషల్ మీడియా వార్ రూం, పార్లమెంట్ ఎన్నికల వర్కింగ్ గ్రూప్ సభ్యులతో కూడా ఆయన ఇన్-కెమెరా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, టీఎస్ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ కే.లక్ష్మణ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సహా ముఖ్య నేతలు పాల్గొంటారని ఆదివారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్చి 12న ఒకరోజు పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు రానున్నారు. తొలుత చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రార్థనలు చేసి, ఆ తర్వాత ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో సోషల్ మీడియా వారియర్లతో సమావేశం నిర్వహించి, పోలింగ్ బూత్‌లో ప్రసంగిస్తారు.
ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను షా నేతలకు వివరించే అవకాశం ఉంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు గాను 9 స్థానాలకు బీజేపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి 10 సీట్లకు పైగా గెలుచుకోవాలని భావిస్తోంది.
Also Read: Shami- Rishabh Pant: టీ20 ప్రపంచకప్ ఆడనున్న రిషబ్ పంత్.. మెగా టోర్నీకి షమీ దూరం..!
తెలంగాణలో నేటి అమిత్ షా షెడ్యూల్ ఇదే
– మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు అమిత్ షా.. బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్నారు.
– మధ్యాహ్నం 1.45 నుంచి 2.45 వరకు ఇంపీరియల్ గార్డెన్స్‌లో సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్‌లో కార్యకర్తలకు, నాయకులకు అమిత్ షా దిశా నిర్దేశం చేస్తారు.
– మధ్యాహ్నం 3.15 నుంచి 4.25 వరకు LB స్టేడియంలో విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొననున్నారు.
– సాయంత్రం 4.45 నుంచి 5.45 వరకు ITC కాకతీయలో తెలంగాణలోని పార్టీ ముఖ్య నేతల సమావేశం జరగనుంది.
– సాయంత్రం 6.10 బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీ తిరుగు ప్రయాణం కానున్నారు.
We’re now on WhatsApp : Click to Join