Bandi yatra: బండి యాత్ర చివరి సమావేశానికి హాజరుకానున్న అమిత్ షా..!
- Author : HashtagU Desk
Date : 06-04-2022 - 9:10 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈ క్రమంలో మంగళవారం నిర్వహించే బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్ర బీజేపీ శ్రేణులు అలెర్ట్ అయ్యారు. ఇకపోతే హైదరాబాద్ శివార్లలోని మహేశ్వరంలో బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం న్యూఢిల్లీలో ఉన్న బండి సంజయ్, తాజాగా అమిత్ షాను కలవడంతో పాటు, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా కలిశారు.
ఈ నేపధ్యంలో రాష్ట్రంలో తను చేపట్టిన పాదయాత్ర, తెలంగాణ రాజకీయ పరిస్థితుల గురించి జాతీయ బీజేపీ నేతలిద్దరికీ వివరించి, ప్రజాసంగ్రామ యాత్రలో భాగం కావాలని వారిద్దరినీ ఆహ్వానించారు. ఇక పాదయాత్రలో చేరాలన్న ఆహ్వానాన్ని నడ్డా అంగీకరించగా, పాదయాత్ర చివరిరోజున నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతానని బండి సంజయ్‌కు, అమిత్ షా హామీ ఇచ్చారు. ఇకపోతే బండి సంజయ్ ఏప్రిల్ 14న తన వాక్‌థాన్ రెండో దశను ప్రారంభించనున్నారు. అయిఈతే అమిత్ షా హాజరుకానున్న సమావేశానికి ఇంకా తేదీ ఖరారు కాలేదు.