Allu Arjun : అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. మళ్లీ పోలీసుల నోటీసులు
Allu Arjun : కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీ తేజను పరామర్శించడానికి వెళ్ళడానికి అల్లు అర్జున్ వెళ్తునందుకు ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ హాస్పిటల్ దగ్గరకు రావద్దని, ఎవరూ వచ్చేందుకు అనుమతి ఇవ్వడంలేదని పోలీసులు స్పష్టం చేశారు.
- By Kavya Krishna Published Date - 10:43 AM, Sun - 5 January 25

Allu Arjun : పుష్ప-2 ది రూల్ సినిమా విడుదల నేపథ్యంలో నిర్వహించిన ప్రీమియర్ షోలో చూసేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వచ్చినప్పుడు జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటనలో మృతి చెందిన మహిళ రేవతి కుమారుడు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు మరో షాక్ తగిలింది. రాంగోపాల్ పేట పోలీసుల ద్వారా అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేయడం జరిగింది. కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీ తేజును పరామర్శించడానికి వెళ్లే సమయంలో ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలీసుల ప్రకారం, హాస్పిటల్‌కు వెళ్లేందుకు ఎవరూ అనుమతినిచ్చి లేకపోవడంతో, అల్లు అర్జున్ హాస్పిటల్ వద్ద వస్తే, అక్కడ జరిగే ఏదైనా పరిణామాలకు ఆయన పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
Pawan Kalyan: చిత్ర పరిశ్రమకు రాజకీయాలను అంటించకూడదు.. పవన్ చురకలు ఎవరికీ?
పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లినప్పుడు ఆయన నిద్రలో ఉన్నారని, అందుకే అతని మేనేజర్‌కు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. అలాగే, పోలీసులు కోర్టు అనుమతి లేకుండా అల్లు అర్జున్ ఎక్కడికీ వెళ్లకూడదని స్పష్టం చేశారు. ఈ పరిణామాలు, అల్లు అర్జున్ హాట్ టాపిక్‌గా మారడంలో కారణమయ్యాయి. ఈ ఘటనపై అల్లు అర్జున్ అభిమానులు, మీడియా మాధ్యమాల్లో వివిధ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ నేడు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లనున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణలో భాగంగా, నాంపల్లి కోర్టు ప్రతి ఆదివారం ఆయనను పోలీస్‌స్టేషన్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. కోర్టు షరతుల ప్రకారం, అల్లు అర్జున్ చిక్కడపల్లి స్టేషన్‌లో సంతకం చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, కోర్టు ఆదేశాల మేరకు అల్లు అర్జున్ చిక్కడపల్లి స్టేషన్ లో హాజరై సంతకం చేయాల్సి ఉంటుంది. ఆయన్ను పలుచోట్ల చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పోలీసుల సూచన ప్రకారం, స్టేషన్ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేయబడింది.
Gold Price Today : కొత్త సంవత్సరంలో మొదటిసారి తగ్గిన బంగారం, వెండి ధరలు