HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >All About The Vietnam War Era Chopper Carrying Iran President That Crashed

Ebrahim Raisi : కుప్పకూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్.. ఏమిటా హెలికాప్టర్ నేపథ్యం ?

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రయీసీ(Ebrahim Raisi),  విదేశాంగ మంత్రిగా అమీర్ అబ్దుల్లా హియాన్‌లు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు.

  • By Pasha Published Date - 10:39 AM, Mon - 20 May 24
  • daily-hunt
Ebrahim Raisi
Ebrahim Raisi

Ebrahim Raisi : ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రయీసీ(Ebrahim Raisi),  విదేశాంగ మంత్రిగా అమీర్ అబ్దుల్లా హియాన్‌లు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. వీరిద్దరు ప్రయాణిస్తున్న బెల్ 212 హెలికాప్టర్ ఆదివారం నాడు అజర్‌బైజాన్ దేశ సరిహద్దుల్లోని మంచు పర్వతాల్లో కుప్పకూలింది. ఈనేపథ్యంలో ఆ హెలికాప్టర్‌కు సంబంధించిన కీలక విషయాలను తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

‘బెల్ 212’ హెలికాప్టర్‌‌ను ‘బెల్ టూ-ట్వెల్వ్’ అని కూడా  పిలుస్తారు. రెండు బ్లేడ్లు ఉండే మిడ్ రేంజ్ హెలికాప్టర్ ఇది. 1968 నుంచి దీని వినియోగం మొదలైంది. వాస్తవానికి అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న ఫోర్ట్ వర్త్‌లో ఈ హెలికాప్టర్ తయారైంది. అయితే 1986 నుంచి దీని ఉత్పత్తి ప్రక్రియను కెనడాలోని కెనడాలోని మిరాబెల్ ప్రాంతంలో జరగసాగింది. అక్కడే బెల్ కమర్షియల్ హెలికాప్టర్ల ఉత్పత్తి పెద్దసంఖ్యలో జరిగింది. పౌర విమానయాన సంస్థలకు ఈ హెలికాప్టర్లను పెద్దసంఖ్యలో విక్రయించారు. ఇందులో పైలట్‌తో పాటు 14 మంది ప్రయాణికులు కూర్చోవచ్చు.  ఈ హెలికాప్టర్ 2,268 కేజీల బరువును మోసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది. వియత్నాం యుద్ధం టైంలో అమెరికా కూడా ఈ హెలికాప్టర్లను వినియోగించింది.

Also Read :Chicken Price : చుక్కలు చూపిస్తున్న చికెన్ రేట్లు.. ఎందుకు ?

  • ‘బెల్ 212’ హెలికాప్టర్‌‌ను అమెరికా తొలుత యుటిలిటీ హెలికాప్టర్‌ (UH)గా వినియోగించేది. ప్రజల తరలింపు, వైమానిక అగ్నిమాపక సామగ్రి మోహరింపు,  సరుకు రవాణా, ఆయుధాల తరలింపు వంటి అవసరాలను దీన్ని వాడేవారు.
  • ఆదివారం రోజు కూలిపోయిన ఇరాన్ మోడల్ ‘బెల్ 212’ హెలికాప్టర్‌‌‌ను ప్రయాణికులను తరలించడానికి అనుగుణంగా డిజైన్  చేశారు.
  • బెల్ హెలికాప్టర్ తాజా వెర్షన్ పేరు ‘సుబారు బెల్ 412’. దీన్ని అమెరికా, కెనడా సహా పలు ఐరోపా దేశాల్లో  పోలీసు ఉపయోగం, వైద్య రవాణా, దళాల రవాణా, విద్యుత్ అత్యవసర సేవలు, అగ్నిమాపక సేవల కోసం వాడుతున్నారు.
  • బెల్ 212ను జపాన్ కోస్ట్ గార్డ్, థాయిలాండ్ పోలీసులు కూడా వినియోగిస్తున్నారు.
  • ఇరాన్ ప్రభుత్వం వద్ద దాదాపు పది ‘బెల్ 212’ హెలికాప్టర్లు ఉన్నాయని అంచనా.
  • 2018లో ఇరాన్‌లో ఇదే మోడల్‌కు చెందిన హెలికాప్టర్ కూలిన ఘటనలో దాదాపు నలుగురు చనిపోయారు.
  • 2023 సెప్టెంబర్‌‌లో ప్రైవేట్ ట్రావెల్స్ సేవలు అందించే బెల్ 212 హెలికాప్టర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీరంలో కూలిపోయింది.

Also Read : Haldiram: రూ. 70 వేల కోట్ల ఆఫ‌ర్‌.. నో చెప్పిన హల్దీరామ్ కంపెనీ..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bell 212
  • Ebrahim Raisi
  • Iran Chopper
  • Iran President
  • vietnam

Related News

    Latest News

    • AP Secretariat Employees : సచివాలయ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు

    • BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

    • Gold & Silver Rate Today : ఒకేసారి భారీగా తగ్గిన వెండి ధరలు

    • BC Bandh : BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    Trending News

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

      • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd