UP: చౌధరీ చరణ్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలి -అఖిలేశ్ యాదవ్
- By hashtagu Published Date - 05:19 PM, Thu - 23 December 21

యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు. మాజీ ప్రధాని చౌధరీ చరణ్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. చరణ్ సింగ్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆయనను అఖిలేశ్ గుర్తు చేసుకున్నారు. రైతుల కోసం సర్వస్వాన్ని అర్పించిన వ్యక్తి చరణ్ సింగ్ అని… ఆయనకు కేంద్రం భారతరత్న ఇవ్వాలని కోరారు.