HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ajasthan Royals Owe It To Jos Buttler Service

IPL 2022: ముంబై పై రాయల్స్ విక్టరీ

ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది.

  • Author : Hashtag U Date : 03-04-2022 - 2:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jose Butler
Jose Butler

ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్‌తో ఆఖరి ఓవర్ వరకు రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 23 పరుగుల తేడాతో పరాజయం పాలయ్యింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. జోస్ బట్లర్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 68 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100 రన్స్ చేశాడు. చివర్లో షిమ్రాన్ హెట్‌మైర్ 14 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 35, సంజూ శాంసన్ 21 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 30 రన్స్ చేశారు. ముంబై బౌలర్లలో బుమ్రా, టైమిల్ మిల్స్ మూడు వికెట్లు తీయగా.. కీరన్ పొలార్డ్ ఓ వికెట్ పడగొట్టాడు.

194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ త్వరగానే కెప్టెన్ రోహిత్ శర్మ(10) అన్‌మోల్ ప్రీత్ సింగ్(5) వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, ఓపెనర్ ఇషాన్ కిషన్ ధాటిగా ఆడటంతో ముంబై.. పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది.
ఆ తర్వాత మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ ఆర్‌ఆర్ బౌలర్లకు చుక్కలు చూపించింది. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ వరుసగా రెండో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే తెలుగు కుర్రాడు తిలక్ వర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆడుతున్న రెండో మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి తనపై ముంబై మేనేజ్‌మెంట్ పెట్టుకున్ననమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. డికాక్, తిలక్ వర్మ ఔటయిన తర్వాత పరుగులు చేసినా ముంబై వరుస వికెట్లు కోల్పోయింది. అయితే డేంజరస్ బ్యాట్స్‌మన్ కీరన్ పొలార్డ్ భారీ షాట్లు ఆడటంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి ఓవర్లో ముంబై విజయానికి 29 పరుగులు అవసరం కాగా.. ఫస్ట్ బాల్ వైడ్ వేసిన సైనీ.. రెండో బాల్ బౌండరీ ఇవ్వడంతో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. కానీ తర్వాతి బంతులను సైనీ డాట్ చేయడంతో రాజస్థాన్ రాయల్స్ విజయం లాంఛనమైంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 68 ball century by jos
  • IPL 2022
  • Jos Buttler
  • mumbai indians
  • rajasthan royals

Related News

League Stage Concludes: Who Will Face Whom, and When?

IPL 2026: ముగిసిన లీగ్ స్టేజ్.. ఎవ‌రితో ఎవ‌రు ఎప్పుడు త‌ల‌ప‌డ‌నున్నారంటే?

దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2026 లీగ్ సమరానికి తెరపడింది. ఎన్నో మలుపులు, అనూహ్య ఫలితాలతో రసవత్తరంగా సాగిన ఈ దశలో చివరి మ్యాచ్ వరకూ ప్లే ఆఫ్స్ బెర్తులపై ఉత్కంఠ కొనసాగింది. రాజస్థాన్ రాయల్స్ తన చివరి మ్యాచ్‌లో గెలవడంతో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల ఆశలు గల్లంతయ్యాయి. లీగ్ దశ ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గ

    Latest News

    • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

    • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

    • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

    • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

    • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd