Aghori Spotted In Tirupati : తిరుపతి లో అర్ధరాత్రి అఘోరి హల్‌చల్
Aghori : గోవులను అక్రమంగా వధించేందుకే తరలిస్తున్నారని ఆరోపిస్తూ, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది
- By Sudheer Published Date - 01:59 PM, Sun - 2 March 25

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న అఘోరి (Aghori ) తాజాగా తిరుపతి జిల్లాలో అర్ధరాత్రి హల్‌చల్ చేసింది. చిల్లకూరు మండలంలోని బోధనం టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై గోవులను తరలిస్తున్న మూడు లారీలను ఆపి, అనుమతి పత్రాలు చూపించాలంటూ లారీ డ్రైవర్లను ప్రశ్నించింది. గోవులను అక్రమంగా వధించేందుకే తరలిస్తున్నారని ఆరోపిస్తూ, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనతో టోల్ ప్లాజా వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
English Language: అమెరికాలో అధికారిక భాషగా ఇంగ్లిష్.. ఆంగ్లంపై ఆసక్తికర విశేషాలివీ
అఘోరి చర్యకు మద్దతుగా అక్కడికి చేరుకున్న హిందూ సంఘాల సభ్యులు కూడా గోవులను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తూ, లారీలను అడ్డుకున్నారు. మరోవైపు అక్కడే ఉన్న కొంతమంది హిజ్రాలు అఘోరిని ప్రశ్నిస్తూ, లారీలను ఎందుకు ఆపుతున్నావని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో అక్కడ తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి అక్రమ రవాణా నిరాటంకంగా సాగుతోందంటూ అఘోరి ఆగ్రహం వ్యక్తం చేసింది.
RK Beach : విశాఖ వాసులకు చేదు వార్త..ఇక బీచ్ కు ఆ గుర్తింపు లేదు
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అఘోరి లారీలను నిలిపివేయడం, అక్కడి వాగ్వాదం, గోవుల రక్షణకు హిందూ సంఘాల మద్దతు వంటి అంశాలు నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. చివరికి, అఘోరి డిమాండ్ మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని లారీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించగా, అక్రమ గోవు రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.