RK Beach : విశాఖ వాసులకు చేదు వార్త..ఇక బీచ్ కు ఆ గుర్తింపు లేదు
RK Beach : ఇటీవల కాలంలో నిర్వహణలో లోపాలు, శుభ్రతా సమస్యలు మరియు పర్యావరణ పరిరక్షణలో నిర్లక్ష్యం కారణంగా ఈ గుర్తింపును తొలగించారు
- By Sudheer Published Date - 12:29 PM, Sun - 2 March 25

విశాఖపట్నం రుషికొండ బీచ్(Vizag RK Beach)కు బ్లూఫ్లాగ్ (‘Blue Flag’) గుర్తింపు తాత్కాలికంగా రద్దు చేయబడింది. డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ (FEE) ఈ నిర్ణయాన్ని తీసుకుంది. 2020లో బ్లూఫ్లాగ్ గుర్తింపు పొందిన ఏకైక ఆంధ్రప్రదేశ్ బీచ్‌గా రుషికొండ ప్రత్యేకతను చాటుకుంది. అయితే ఇటీవల కాలంలో నిర్వహణలో లోపాలు, శుభ్రతా సమస్యలు మరియు పర్యావరణ పరిరక్షణలో నిర్లక్ష్యం కారణంగా ఈ గుర్తింపును తొలగించారు.
Akhanda: హిమాలయాల్లో అఖండ పోరు.. ఈ సారి కూడా హిట్ గ్యారెంటీ అంటూ!
గత కొంతకాలంగా బీచ్‌లో శునకాలు అధికంగా తిరుగడం, సీసీటీవీ కెమెరాలు సరిగ్గా పని చేయకపోవడం, వ్యర్థాలు పేరుకుపోవడం, నడక మార్గాలు దెబ్బతినడం వంటి సమస్యలు వచ్చాయి. అదనంగా టాయిలెట్లు, బట్టలు మార్చుకునే గదులను సరిగా నిర్వహించకపోవడం, వాటి పాడుబడిన స్థితి ఇక్కడి పర్యాటకులను అసంతృప్తికి గురి చేసింది. ఈ సమస్యలను కొందరు స్థానికులు, పర్యాటకులు ఫోటోలు తీసి గత నెల 13వ తేదీన డెన్మార్క్ సంస్థకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల ఆధారంగా నిర్వహించిన పరిశీలనలో రుషికొండ బీచ్ నిర్వహణ అసంతృప్తికరంగా ఉందని తేలడంతో బ్లూఫ్లాగ్ గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేశారు.
Weekly Horoscope : మార్చి 2 నుంచి 8 వరకు వారఫలాలు.. ఆ రాశుల వాళ్లకు రాజయోగం
రుషికొండ బీచ్ నిర్వహణలో పాలకపార్టీల మార్పులతో సమస్యలు పెరిగాయని విమర్శలు ఉన్నాయి. 2018లో తెలుగుదేశం పార్టీ హయాంలో కేంద్ర నిధులతో రూ.7 కోట్లు ఖర్చు చేసి మౌలిక వసతులు మెరుగుపరిచారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీచ్ నిర్వహణను ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. కానీ సిబ్బంది కొరతతో నిర్వహణ క్రమంగా దిగజారిందనే ఆరోపణలు ఉన్నాయి. 2023 నవంబరులో ప్రైవేట్ సంస్థ నిర్వహణ కాలపరిమితి ముగిసిన తర్వాత ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో రుషికొండ బీచ్ శుభ్రత, పర్యావరణ పరిరక్షణ చర్యలను పునరుద్ధరించి మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు తెచ్చుకోవాలని విశాఖ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.