Kalpika Ganesh : సినీనటి కల్పికపై మరో కేసు నమోదు
Kalpika Ganesh : సినీ నటి కల్పికా గణేష్ పుట్టినరోజు వేడుకలు వివాదంగా మారి.. ప్రిజం పబ్ సిబ్బందిపై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే.
- By Kavya Krishna Published Date - 02:06 PM, Sat - 14 June 25

Kalpika Ganesh : సినీ నటి కల్పికా గణేష్ పుట్టినరోజు వేడుకలు వివాదంగా మారి.. ప్రిజం పబ్ సిబ్బందిపై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే పబ్ యాజమాన్యం ఆమెపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అయితే.. తాజాగా మరో కేసు కూడా కల్పికా గణేష్ పై నమోదైంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం (ITA) 2000-2008 లోని సెక్షన్ 67, అలాగే భారత న్యాయ వ్యవస్థలో ఇటీవల ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్ 79, 356 కింద కేసు నమోదు చేశారు. బాధితురాలిగా కీర్తన అనే యువతి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలకు పాల్పడ్డారు.
Yoga : 5 లక్షల మందితో విశాఖలో యోగా..కేంద్రమంత్రి కీలక ప్రకటన..!
కీర్తన తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, కల్పికా గణేష్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో అసభ్య పదజాలంతో దూషించిందని ఆరోపించారు. ఈ ఆరోపణలు కేవలం ఆన్లైన్ అబ్యూసింగ్‌కు పరిమితం కాకుండా, వేధింపులకు కూడా కల్పిక పాల్పడుతున్నట్లు కీర్తన తన ఫిర్యాదులో వివరించారు. అంతేకాకుండా, కల్పికా తన స్టేటస్‌ల ద్వారా ఇతరులను విమర్శిస్తూ, వ్యక్తిగతంగా మెసేజ్ ద్వారా దూషించిందని, వాటిని స్క్రీన్‌షాట్ల రూపంలో సేకరించి పోలీసులు సమర్పించినట్లు తెలిసింది.
ఈ ఆధారాలను పరిశీలించిన అనంతరం పోలీసులు కేసును నమోదు చేశారు. ఇది కల్పికా గణేష్‌పై నమోదైన రెండో కేసు కావడం గమనార్హం. ఇప్పటికే ఒక కేసు ఎదుర్కొంటున్న ఆమెపై మరొక ఫిర్యాదు నమోదు కావడంతో సినీ పరిశ్రమలోనూ, నెటిజన్ల మధ్య ఈ ఘటనపై చర్చ జరుగుతోంది. పోలీసులు ప్రస్తుతం ఈ కేసులో తదుపరి విచారణ చేపడుతున్నారు.
CBN : ఏ బిడ్డను చదివించాలో తేల్చుకో అని జగన్ అంటే..ప్రతి బిడ్డను చదివించమ్మా అని చంద్రన్న అన్నాడు