CBN : ఏ బిడ్డను చదివించాలో తేల్చుకో అని జగన్ అంటే..ప్రతి బిడ్డను చదివించమ్మా అని చంద్రన్న అన్నాడు
CBN : ఇది కేవలం పథకం కాదు… తల్లికి గౌరవం, ప్రతి బిడ్డకు భవిష్యత్తు ఇచ్చే సంకల్పం. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిజం చేస్తూ తల్లి కన్నీటిని తుడిచి, ఆ కుటుంబంలో ఆనందం నింపారు చంద్రబాబు
- By Sudheer Published Date - 12:38 PM, Sat - 14 June 25

ఒక తల్లి తన పిల్లలలో ఎవరిని చదివించాలో తేల్చుకోవాల్సిన పరిస్థితిని గత ప్రభుత్వం తేవడమే కాక, ఆ కఠిన నిర్ణయాన్ని ఆమె మీద మోపింది. వైఎస్సార్ కాంగ్రెస్ (YCP) హయాంలో ‘జగనన్న అమ్మఒడి’ (Jagananna Amma Vodi)పథకం కేవలం ఒకే బిడ్డకే వర్తించాలన్న నిబంధన తల్లుల మనసులో నొప్పిని కలిగించింది. “ఏ బిడ్డను చదివించాలో నువ్వే నిర్ణయించుకో” అన్నట్లు చేసిన వైఖరి గర్భశోకాన్ని తెచ్చింది. తల్లికి తన పిల్లలంతా సమానమే. వారిలో ఒకరిని వదిలేయడం కన్నతల్లికి బాధకరం.
Balakrishna : బాలకృష్ణ పాదాలు తాకిన ఆ స్టార్ హీరోయిన్
అయితే ఆ తల్లుల కన్నీటి గాధలకు చరమగీతం వేశారు చంద్రబాబు నాయుడు. ‘‘నీకెంతమంది పిల్లలున్నా అందరికీ చదువు అవసరం ఉంది. అందుకే ప్రతి బిడ్డకి రూ.15,000 చొప్పున మేము ఇవ్వగలుగుతాం’’ అని ఆయన ఘనంగా ప్రకటించారు. ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam ) పథకం ద్వారా ఏ తల్లినైనా చిన్నచూపు చూడకుండా, పిల్లల సంఖ్య ఆధారంగా పూర్తిస్థాయిలో ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ విద్యాసంవత్సరంలోనే 67 లక్షల మందికిపైగా తల్లుల ఖాతాల్లో రూ.10,000 కోట్లు నేరుగా జమ చేయడం ద్వారా చంద్రన్న తన మాటను నిలబెట్టుకున్నారు.
ఇది కేవలం పథకం కాదు… తల్లికి గౌరవం, ప్రతి బిడ్డకు భవిష్యత్తు ఇచ్చే సంకల్పం. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిజం చేస్తూ తల్లి కన్నీటిని తుడిచి, ఆ కుటుంబంలో ఆనందం నింపారు చంద్రబాబు నాయుడు. వాగ్దానాలు చేసి వదిలేసిన నాయకుల మాదిరిగా కాకుండా.. చెప్పిన మాటను చేతల్లోకి తీసుకొచ్చారు. “ఒకరు మాటల నాయకుడు అయితే మా చంద్రన్న చేతల నేత అంటూ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.