Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని ఘోర ప్రమాదం.. గని కూలి ఏడుగురు దుర్మరణం
ఛత్తీస్‌గఢ్‌లోని ఘోర ప్రమాదం జరిగింది.
- By Balu J Published Date - 04:42 PM, Fri - 2 December 22

ఛత్తీస్‌గఢ్‌లోని ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లోని మల్గావ్‌లో గని కూలిపోవడంతో ఏడుగురు మరణించారు. డజనుకు పైగా గ్రామస్థులు చిక్కుకున్నట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. చనిపోయిన ఏడుగురిలో ఆరుగురు మహిళలని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు ఇద్దరు గ్రామస్తులను ఖాళీ చేయించినట్లు సమాచారం.