Viagra Pills: మద్యం తాగి 2 వయాగ్రా మాత్రలు వేసుకున్నాక.. 24 గంటల్లోనే వ్యక్తి మృతి
మరుసటి రోజు ఉదయం అతడికి "అసౌకర్యం" ఏర్పడింది. వాంతులు అయ్యాయి. దీంతో అతడి స్నేహితురాలు వైద్య సహాయం కోరింది. అయితే అతడు డాక్టర్లకు చెప్పాల్సిన అవసరం
- By Maheswara Rao Nadella Published Date - 09:00 AM, Wed - 8 March 23

అతడి వయసు 41 ఏళ్ళు. నాగ్‌పూర్‌లోని ఒక హోటల్‌లో తన దగ్గరి స్నేహితురాలిని కలుసుకున్నాడు. మద్యం తాగుతూ రెండు వయాగ్రా మాత్రలు (Viagra Pills) వేసుకొని శృంగారంలో పాల్గొన్నాడు. మరుసటి రోజు ఉదయం అతడికి “అసౌకర్యం” ఏర్పడింది. వాంతులు అయ్యాయి. దీంతో అతడి స్నేహితురాలు వైద్య సహాయం కోరింది. అయితే అతడు డాక్టర్లకు చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. గతంలోనూ ఇలాంటి ప్రాబ్లమ్ ఎదుర్కొన్నానని చెప్పాడు.
ఈక్రమంలో ఒక్కసారిగా అతడి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు ఆసుపత్రికి తరలించేలోపే మరణించినట్లు ప్రకటించారు. అతడి మెదడుకు ఆక్సిజన్ డెలివరీ తగ్గిపోయి.. సెరెబ్రోవాస్కులర్ హెమరేజ్ వచ్చి మరణించాడని వైద్యులు నిర్ధారించారు. జర్నల్ ఆఫ్ ఫోరెన్సిక్ అండ్ లీగల్ మెడిసిన్‌లో ఈ అధ్యయన నివేదిక పబ్లిష్ అయింది. వయాగ్రా బ్రాండ్ పేరుతో విక్రయించబడుతున్న “సిల్డెనాఫిల్” యొక్క రెండు 50mg టాబ్లెట్‌లను అతడు తీసుకున్నాడని గుర్తించారు. అతడికి పోస్ట్‌మార్టం స్కానింగ్ చేయగా.. మెదడులో 300 గ్రాముల రక్తం గడ్డకట్టినట్లు తేలింది. వైద్య సలహా లేకుండానే అంగస్తంభన మందులను తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ అరుదైన కేసును ప్రచురించినట్లు రచయితలు వెల్లడించారు.
వయాగ్రా (Viagra) అంటే..
వయాగ్రా ఒక అల్లోపతి ఔషధము. దీని అసలు పేరు సిల్డినాఫిల్ సిట్రేట్ . పురుషుల్లో అంగస్తంభన లోపాన్ని అధిగమించేందుకు అందుబాటులోకి వచ్చిన ఆధునిక మందు ఇది! అమెరికా ఎఫ్‌డీఏ దీనికి అనుమతినిచ్చి సరిగ్గా 19 ఏళ్ళు అవుతోంది.ఈ దశాబ్దకాలంలో అంతర్జాతీయంగా ఇది సృష్టించిన సంచలనానికి అంతులేదు.1999-2001ల మధ్య ఫైజర్ కంపెనీ కేవలం ఈ మాత్ర మీదే ఏటా 100 కోట్ల డాలర్ల వ్యాపారం చేసిందంటే దీనికి లభించిన ఆదరణ ఎంతటిదో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.
ప్రతి వ్యక్తి ఒక నిర్దిష్ట వయస్సు వచ్చిన తర్వాత శృంగారంలో పాల్గొనడానికి ఆసక్తి చూపడం సహజం. బంగారాన్ని మించిన విలువైన సంపద శృంగారం అని చెప్తారు. శృంగారం అనేది స్త్రీ పురుషుల్లో సహజంగా జరిగే ప్రాకృతిక చర్య. అయితే, అంగస్తంభన సమస్య ఉన్న పురుషులకు వయాగ్రా ఒక ఉత్ప్రేరకం లాంటిది. దీనిని వైద్యుల సలహాతో తీసుకోవాలి. ఫార్మసీలలో వయాగ్రా టాబ్లెట్ రూపంలో అందుబాటులో ఉంటుంది. దీనిని సెక్స్ టాబ్లెట్ అని కూడా పిలుస్తారు.
Also Read: Sleep Well: మీరు రోజు సరిగ్గా నిద్రపోతున్నారా? ఇవి తెలుసుకోండి..

Related News

Deer-Leopard: వామ్మో.. తెలివైన జింక.. ప్రాణాలు పోయినట్లు నటించి చిరుత నుండి ఎలా తప్పించుకుందో చూడండి?
మామూలుగా చిరుత పులికి జింక కనిపిస్తే చాలు ఆరోజు దానికి పండగ అని చెప్పాలి. కానీ దొరికిపోయిన జింకకు మాత్రం అదే చివరి రోజు. పొరపాటున పులి కంట పడితే ఆ జింక ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే.