Huge Crater : రష్యా వల్ల చంద్రుడిపై పెద్ద గొయ్యి.. ఎలా పడిందంటే ?
Huge Crater : రష్యా పంపిన ‘లూన్ -25’ ల్యాండర్ చంద్రుడిపై సక్సెస్ ఫుల్ గా దిగలేకపోయింది.
- Author : Pasha
Date : 01-09-2023 - 4:17 IST
Published By : Hashtagu Telugu Desk
Huge Crater : రష్యా పంపిన ‘లూన్ -25’ ల్యాండర్ చంద్రుడిపై సక్సెస్ ఫుల్ గా దిగలేకపోయింది. అది జాబిల్లి వాతావరణంలోకి ఎంటర్ కాగానే కంట్రోల్ కోల్పోయి ఆగస్టు 21న కుప్పకూలింది. అయితే తాజాగా ఆ ల్యాండర్ కూలిన చోట చంద్రుడిపై ఎంతపెద్ద గొయ్యి పడిందనే దానిపై ఒక ఆధారాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా రిలీజ్ చేసింది. లూనా-25 కూలిన చోటులో దాదాపు 10 మీటర్ల వెడల్పయిన గొయ్యి పడిందని తెలిపింది.
Also read : iQOO Z7 Pro 5G: స్టైలిష్ లుక్ తో అదరగొడుతున్న కొత్త ఐక్యూ 5జీ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?
అయితే ఈ మిషన్ ఎందుకు ఫెయిల్ అయిందనే దానిపై దర్యాప్తునకు రష్యా ప్రభుత్వం ఒక విచారణ కమిటీని (Huge Crater) ఏర్పాటు చేసింది.అది ప్రస్తుతం వైఫల్యానికి గల కారణాలను వెతికే పనిలో పడింది. చంద్రుడిపై పరిశోధనల కోసం రష్యా 47 ఏళ్ల గ్యాప్ తర్వాత తొలిసారిగా లూనా-25 ను ఆగస్టు 11న ప్రయోగించింది. అయితే జాబిల్లిపైకి అడుగు మోపడంలో విఫలమైంది. మరోవైపు దాదాపు ఇదే టైంలో భారత్ సక్సెస్ ఫుల్ గా చంద్రయాన్ -3 పూర్తి చేసి యావత్ ప్రపంచం మన్ననలు అందుకుంది.