Dog Traveller: ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తున్న కుక్క, నెటిజన్స్ ఫిదా!
జంతువులు కూడా ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లాలనుకుంటాయా అంటే అవుననే సమాధానం ఇస్తోంది ఓ కుక్క.
- By Balu J Published Date - 06:18 PM, Wed - 17 May 23

రోజూ మనం కోరుకున్న గమ్యస్థానాలకు చేరుకోవడానికి మెట్రో లేదా లోకల్ రైలులో వెళ్తాము. అయితే, జంతువులు కూడా ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లాలనుకుంటాయా అంటే అవుననే సమాధానం ఇస్తోంది ఓ కుక్క. మాకు అవసరాలు ఉంటాయి.. మేం ఈ ప్రపంచంలో భాగమే అని సంకేతం ఇస్తోంది. ముంబైలోని లోకల్ ట్రైన్ లో ఓ కుక్క ప్రతిరోజు ప్రయాణిస్తూ ప్రయాణికులను ఆశ్చర్యపరుస్తోంది. ఓ స్థానికుడిని రైలులో కుక్క ఎక్కిస్తున్నట్లు ద్రుశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోకు దాదాపు 5 లక్షల మంది వీక్షించారు. బోరివాలి స్థానికుడిని ప్రతిరోజూ తీసుకెళ్లి అంధేరిలో దిగబెడుతుంది. “#ముంబయిలో లోకల్ ట్రైన్ రెగ్యులర్ ట్రావెలర్‌ని కలవండి” అని వీడియో క్యాప్షన్ నెటిజన్స్ ఆకట్టుకుంటోంది. చాలామంది కుక్క కోసమే లోకల్ ట్రైన్ ఎక్కుతున్నారు కూడా. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోను చూసేయ్యండి.
Also Read: Keerthy Suresh BF: అతడే కీర్తి భాయ్ ఫ్రెండ్.. దసరా బ్యూటీ రియాక్షన్ ఇదే!
Related News

Bhaag Mantri Bhaag: కేంద్ర మంత్రి మీనాక్షి పరుగో పరుగు.. కేటీఆర్ ఫన్నీ ట్వీట్
ఢిల్లీలో కేంద్ర మంత్రి మీనాక్షి లేఖికి మీడియా సెగ తగిలింది. ఢిల్లీలో రెజ్లర్ల నిరసన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో మీడియా కేంద్ర మంత్రి మీనాక్షి లేఖిని స్పందించాల్సిగా కోరింది.