Dog Van-TTD : టీటీడీ రూల్స్ బ్రేక్.. తిరుమలలోకి కుక్కతో కర్ణాటక భక్తుల ఎంట్రీ
Dog Van-TTD : సాధారణంగా తిరుమలకు వాహనాల్లో పెంపుడు జంతువులను తీసుకురావడాన్ని అనుమతించరు.
- Author : Pasha
Date : 04-07-2023 - 12:22 IST
Published By : Hashtagu Telugu Desk
Dog Van-TTD : సాధారణంగా తిరుమలకు వాహనాల్లో పెంపుడు జంతువులను తీసుకురావడాన్ని అనుమతించరు. కానీ కర్ణాటకకు చెందిన ఓ భక్త బృందం టెంపోలో తమతో పాటు కుక్కను తీసుకొచ్చింది. తనిఖీ కేంద్రాన్ని దాటుకుని వారు కుక్కను తిరుమలకు తీసుకెళ్లడం గమనార్హం. తిరుమలలో వన్య మృగాల సంచారం నేపథ్యంలో శునకాలని కొండ పైకి తీసుకురావడాన్ని టీటీడీ నిషేధించింది. స్థానికులు నివసించే బాలాజీనగర్ లో కూడా శునకాలని పెంచడాన్ని బ్యాన్ చేసింది.
Also read : Rs 820 Crores YouTuber : 820 కోట్లు సంపాదించిన యూట్యూబర్ కథ
అయితే కర్ణాటకకి చెందిన భక్తులు కుక్కని తీసుకొచ్చినా.. భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. భక్తులు కుక్కని వారి వాహనంలోనే(Dog Van-TTD) పెట్టుకొని కొండపై చక్కర్లు కొడుతుండగా తీసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా చిరుత సంచారం పెరిగిన నేపథ్యంలో శునకం కోసం జనవాసాల్లోకి చిరుత వస్తే పరిస్థితి ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.