5G : త్వరలోనే 5జీ సేవలు… ఆ 13 నగరాల్లోనే ..?
దేశంలో మొబైల్ ఫోన్ రంగంలో మరో విప్లవాత్మకమైన మార్పుకు సన్నాహాలు
- By Prasad Published Date - 01:56 PM, Fri - 26 August 22

దేశంలో మొబైల్ ఫోన్ రంగంలో మరో విప్లవాత్మకమైన మార్పుకు సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే తొలి దశలో 13 నగరాల్లోనే ఈ 5జీ సేవలు అందించనున్నారు. అనంతరం దశలవారీగా దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. తొలిదశలో 5జీ సేవలు అందబాటులోకి వచ్చే నగరాల జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క హైదరాబాద్ కు మాత్రమే స్థానం దక్కింది. ఈ జాబితాలో హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, బెంగళూరు, ముంబయి, చెన్నై, కోల్ కతా, పూణే, అహ్మదాబాద్, లక్నో, చండీగఢ్, జామ్ నగర్, గురుగ్రామ్, గాంధీనగర్ ఉన్నాయి. 5జీ సేవలు సెప్టెంబరు 29 నుంచి అందుబాటులోకి వస్తాయని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే దేశంలో 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కోసం భారీ ఎత్తున వేలం జరగడం తెలిసిందే. స్పెక్ట్రమ్ ను చేజిక్కించుకున్న టెలికాం సంస్థలు 5జీ వ్యవస్థల ఏర్పాటులో తలమునకలుగా ఉన్నాయి