Dead Body In Bag : జ్యూస్ కొనిస్తానని ఎత్తుకెళ్లి దారుణం.. ఐదేళ్ల పాపపై హత్యాచారం
Dead Body In Bag : ఓ వ్యక్తి జ్యూస్ కొనిస్తానని ఆశ చూపి.. ఐదేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం కత్తితో ఆ పాప గొంతు కోశాడు.
- By Pasha Published Date - 11:22 AM, Sun - 30 July 23

Dead Body In Bag : ఓ వ్యక్తి జ్యూస్ కొనిస్తానని ఆశ చూపి.. ఐదేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు.
అనంతరం కత్తితో ఆ పాప గొంతు కోశాడు.
చిన్నారి మృతదేహాన్ని గోనె సంచిలో వేసి చెత్తకుప్పల్లో పడేశాడు.
ఈ ఘోరమైన ఘటన కేరళలోని ఎర్నాకులం జిల్లాలో జరిగింది.
Also read : Special Trains: 250కి పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్న భారతీయ రైల్వే శాఖ.. కారణమిదే..?
ఇంతటి దారుణానికి తెగబడిన కామాంధుడు బాలిక ఉన్న భవనంలోనే అద్దెకు నివసించేవాడని పోలీసు దర్యాప్తులో తేలింది. బాగా మద్యం తాగిన తర్వాత అతడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని వెల్లడైంది. ఆ బిల్డింగ్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. ఆ వ్యక్తి పేరు అష్ఫాక్ అస్లం అని, బీహార్‌కు చెందిన అతడు కూలీ పనుల కోసం ఎర్నాకులం జిల్లాకు వలస వచ్చాడని గుర్తించారు. అతడు తనతో పాటు పాపను తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీంతో శనివారం రాత్రి 9.30 గంటలకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతడు స్పృహలో లేడు. బాగా తాగి ఉన్నందున పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదు. అతడు స్పృహలోకి వచ్చాక.. ఇన్వెస్టిగేట్ చేస్తే జరిగిందంతా చెప్పాడు. ఆదివారం ఉదయం నేరం(Dead Body In Bag) అంగీకరించాడు. అయితే బాధిత బాలిక కుటుంబం కూడా బీహార్ నుంచే వలస వచ్చి కేరళలో నివసిస్తోంది.