Road Accident: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి.. పోలీసులపై యాక్షన్
పోలీసులు వెంటపడటంతో వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో విద్యార్థి రోడ్డు ప్రమాదానికి గురైన ఘటన కేరళలోని కాసర్‌గోడ్ మునిసిపల్ పరిథిలో చోటుచేసుకుంది.
- Author : Praveen Aluthuru
Date : 30-08-2023 - 2:27 IST
Published By : Hashtagu Telugu Desk
Road Accident: పోలీసులు వెంటపడటంతో వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో విద్యార్థి రోడ్డు ప్రమాదానికి గురైన ఘటన కేరళలోని కాసర్‌గోడ్ మునిసిపల్ పరిథిలో చోటుచేసుకుంది.
ఓనం వేడుకలు ముగించుకుని కారులో వెళ్తున్న విద్యార్థుల్నిపోలీసులు వెంబడించారు. కారులో నలుగురు విద్యార్థులు ఉన్నారు. వాహన తనిఖీల్లో వాహనం ఆగకపోవడంతో పోలీసులు వారిని వెంబడించారు. ఇంతలో ఫర్హాస్ నడుపుతున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఫర్హాస్ మంగళూరులో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విద్యార్థుల వాహనాన్ని పోలీసులు వెంబడించిన సీసీటీవీ ఫుటేజీ బయటపడింది.
మృతి చెందిన విదార్థి జీహెచ్‌ఎస్‌ఎస్‌లో ప్లస్‌టూ చదువుతున్నాడు. ఫర్హాస్ వయసు 17 సంవత్సరాలు. పోలీసులు వెంబడించడం వల్లే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి తల్లి మానవ హక్కుల కమిషన్‌కు, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్‌ఐ రజిత్, సీపీఓ దీపు, రంజిత్‌లను బదిలీ చేశారు.
Also Read: India vs Pakistan: ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. 10 సెకన్లకు రూ. 30 లక్షలు..!