Planes Collide: కొలంబియాలో ఘోర ప్రమాదం.. గాల్లో విమానాలు ఢీ.. ఇద్దరు మృతి.. వీడియో
సౌత్ అమెరికాలోని కొలంబియాలోని విలావిసెన్సియోలో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ శిక్షణ సమయంలో కొలంబియా ఎయిర్ ఫోర్స్ విమానాలు గాలిలో ఢీకొనడం (Planes Collide)తో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
- Author : Gopichand
Date : 02-07-2023 - 9:20 IST
Published By : Hashtagu Telugu Desk
Planes Collide: సౌత్ అమెరికాలోని కొలంబియాలోని విలావిసెన్సియోలో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ శిక్షణ సమయంలో కొలంబియా ఎయిర్ ఫోర్స్ విమానాలు గాలిలో ఢీకొనడం (Planes Collide)తో ఇద్దరు వ్యక్తులు మరణించారు. సమాచారం ప్రకారం.. ఈ సంఘటన విల్లావిసెన్సియో ఎయిర్ బేస్ వద్ద జరిగింది. విమానం ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఇంతలో మరో విమానం వచ్చి ఢీకొట్టింది. దింతో ప్రమాదం జరిగింది.
2 dead after Colombian Air Force planes collide in mid-air during training in Villavicencio, Colombia pic.twitter.com/k4e2eEDaWV
— BNO News (@BNONews) July 1, 2023
ట్రైనింగ్ సమయంలో రెండు ఎయిర్ ఫోర్స్ విమానాలు ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత విమానాలు రెండు ఓ గ్రామీణ ప్రాంతంలో పడిపోయాయి. విమానం ఢీకొన్న తర్వాత ఘటనకు సంబందించిన వీడియో బయటకు వచ్చింది. వీడియో దాదాపు పది సెకన్లు నిడివి ఉంది. ఆకాశంలో ప్రయాణిస్తున్నప్పుడు రెండు విమానాలు ఢీకొన్న తర్వాత మంటలు చెలరేగడం, విమానం క్రింద పడిపోవటం వీడియోలో చూడవచ్చు. విమానం కూలిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారని అధికారులు తెలిపారు.