Bus Accident: బంగ్లాదేశ్‌లో బస్సు ప్రమాదంలో 17 మంది జల సమాధి
బంగ్లాదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది జల సమాధి కాగా, 35 మంది తీవ్రంగా గాయపడ్డారు.
- By Praveen Aluthuru Published Date - 12:00 PM, Sun - 23 July 23
Bus Accident: బంగ్లాదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది జల సమాధి కాగా, 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. గల్లంతైన మరికొంత మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు స్థానిక పోలీసులు. భండారియా జిల్లా నుంచి ఫిరోజ్‌పూర్‌కు 70 మందితో వెళ్తున్న బస్సు ఛత్రకాండ ప్రాంతంలో అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 17 మంది జలసమాధి అయినట్లు స్థానిక సమాచారం. 17 మంది మృతుల్లో ఏడుగురు మైనర్లు, ఐదుగురు మహిళలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఝలకతి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బస్సు ఆటో రిక్షాకు సైడ్ ఇస్తుండగా ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. కాగా బస్సు ప్రమాదానికి కారణాలు వెతికితే బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం మరియు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Also Read: Madhya Pradesh: పొరపాటున తగిలితే దళితుడిపై మానవ మూత్రవిసర్జనతో దాడి