Madhya Pradesh: పొరపాటున తగిలితే దళితుడిపై మానవ మూత్రవిసర్జనతో దాడి
మధ్యప్రదేశ్‌లో వరుస దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ కుల వివక్ష ప్రధానం వెలుగులోకి వస్తుంది. మొన్నటికి మొన్న గిరిజన కూలీపై ఓ వ్యక్తి కుల వివక్షతో మూత్ర విసర్జన చేసి మానవత్వాని
- Author : Praveen Aluthuru
Date : 23-07-2023 - 11:38 IST
Published By : Hashtagu Telugu Desk
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో వరుస దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ కుల వివక్ష ప్రధానంగా వెలుగులోకి వస్తుంది. మొన్నటికి మొన్న గిరిజన కూలీపై ఓ వ్యక్తి కుల వివక్షతో మూత్ర విసర్జన చేసి మానవత్వానికి మచ్చ తీసుకొచ్చాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో గిరిజన యువకుడిపై మూత్రవిసర్జన చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా మధ్యప్రదేశ్ లో ఓ దళిత వ్యక్తి మరో కులానికి చెందిన వ్యక్తిని పొరపాటున తాకడంతో తన ముఖం, శరీరంపై మానవ మలాన్ని చిమ్మాడు. ఈ ఘటనకు సంబంధించి ఓబీసీ వర్గానికి చెందిన నిందితుడు రామ్‌కృపాల్ పటేల్‌పై సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. బాధితుడు దశరథ్ అహిర్వార్ శనివారం పోలీసులను ఆశ్రయించినట్లు ఆయన తెలిపారు.
ఛతర్‌పూర్ జిల్లా బికౌరా గ్రామంలో అండర్ పైపులు నిర్మిస్తున్న దళితుడు చేతికి అంటిన గ్రీజును చేతి పంపు వద్ద కడుక్కునే సమయంలో పొరపాటున పటేల్ కు తగిలాడు. ఈ క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమీపంలో పడి ఉన్న మానవ విసర్జనను తీసుకువచ్చి తల మరియు ముఖంతో సహా శరీరమంతా పూసాడు. దీంతో బాధితుడు మహారాజ్‌పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పటేల్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
Also Read: Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదు