HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >17 Dead 30 Injured As Bus Falls Off Road In Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్‌లో పెను విషాదం.. 17 మంది మృతి.. 30 మందికి గాయాలు

బంగ్లాదేశ్‌ (Bangladesh)లో వేగంగా వెళ్తున్న బస్సు లోయలో పడి 17 మంది మరణించారు. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో 30 మంది గాయపడినట్లు సమాచారం.

  • By Gopichand Published Date - 01:28 PM, Sun - 19 March 23
  • daily-hunt
Mexico Bus Crash
Road accident

బంగ్లాదేశ్‌ (Bangladesh)లో వేగంగా వెళ్తున్న బస్సు లోయలో పడి 17 మంది మరణించారు. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో 30 మంది గాయపడినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 7.30 గంటలకు మదారిపూర్ లోని ఎక్స్‌ప్రెస్‌వేపై ఎమాద్ పరిభాన్ నడుపుతున్న ఢాకా బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను వివిధ ఆస్పత్రుల్లో చేర్పించినట్లు మదారిపూర్ పోలీస్ సూపరింటెండెంట్ మహ్మద్ మసూద్ ఆలం తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్, మెకానికల్ లోపమే ప్రమాదానికి కారణమని స్థానిక న్యూస్ పోర్టల్ తెలిపింది.

ప్రమాదాన్ని వివరిస్తూ ఫరీద్‌పూర్ ఫైర్ సర్వీస్ డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ షిప్లు అహ్మద్ మాట్లాడుతూ.. వేగంగా వెళుతున్న బస్సు టైరు పగిలి అది అదుపు తప్పి లోయలో పడి నేలను బలంగా ఢీకొట్టడంతో చాలా మంది మృతి చెందారని భావిస్తున్నామని తెలిపారు. అగ్నిమాపక శాఖకు చెందిన మూడు వాహనాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ అధికారి లిమా ఖానుమ్ తెలిపారు. మృతులు, క్షతగాత్రుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.

Also Read: Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

ఇమాద్ పరిభాన్ బస్సు 43 మంది ప్రయాణికులతో ఢాకాకు బయలుదేరిందని బస్ కౌంటర్ ఎండి సాబుజ్ ఖాన్ స్థానిక వార్తాపత్రికతో చెప్పారు. బంగ్లాదేశ్‌లో పాత, పేలవంగా నిర్వహించబడుతున్న వాహనాలు, రోడ్లు అలాగే తక్కువ శిక్షణ పొందిన డ్రైవర్ల కారణంగా రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం అయిపోయాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 17 Dead
  • 30 injured
  • bangladesh
  • road accident
  • world news

Related News

Indian Companies

Indian Companies: భార‌త‌దేశానికి షాక్‌.. మూడు చ‌మురు కంపెనీల‌పై ఆంక్ష‌లు!

దీనికి ముందు అమెరికా ఇప్పటికే రెండు రష్యా చమురు కంపెనీలపై ఆంక్షలు విధించింది. అంతేకాకుండా రష్యాతో చమురు వ్యాపారం కోసం అప్పటి అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంపై 25 శాతం సుంకాన్ని (Tariff) పెనాల్టీగా విధించారు.

  • Longest Life Span

    Longest Life Span: ఏ దేశంలోని ప్ర‌జ‌లు ఎక్కువ కాలం జీవిస్తున్నారో తెలుసా?

  • US Tariffs

    US Tariffs: భార‌త్‌కు గుడ్ న్యూస్‌.. టారిఫ్ భారీగా త‌గ్గింపు!

  • Chinese Physicist Chen-Ning Yang

    Chinese Physicist Chen-Ning Yang: నోబెల్ అవార్డు గ్రహీత కన్నుమూత!

  • No Kings Protests

    No Kings Protests: ట్రంప్‌కు బిగ్ షాక్‌.. రోడ్డెక్కిన వేలాది మంది ప్ర‌జ‌లు!

Latest News

  • TVK Vijay: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌ మళ్లీ రాష్ట్ర పర్యటనకు!

  • Bus Accident’s : సరిగ్గా 12 ఏళ్ల తర్వాత ‘పాలెం’ ఘటన రిపీట్.. మృత్యు రహదారి నేషనల్ హైవే 44..!

  • Justice Surya Kant: సుప్రీంకోర్టు త‌దుప‌రి ప్ర‌ధాని న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ సూర్య‌కాంత్‌.. ఎవ‌రీయ‌న‌?

  • Fire Therapy: శరీరంపై నిప్పుతో చికిత్స.. 100 సంవత్సరాల చైనీస్ సాంప్రదాయం!

  • Revanth Reddy : రేపు ఢిల్లీకు వెళ్లనున్న CM రేవంత్‌రెడ్డి..!

Trending News

    • Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది ఫోన్లు స్విచాఫ్.. ఏమయ్యారు?

    • Kaveri Travels : బస్సు ప్రమాదం.. హైదరాబాద్ లో అన్ని కార్యాలయాలను మూసివేసిన కావేరి ట్రావెల్స్

    • HDFC స్కీమ్.. రూ.10 వేల తో రూ.37 లక్షలు..!

    • New Rules: అల‌ర్ట్‌.. న‌వంబ‌ర్ నుంచి కొత్త రూల్స్‌!

    • Gold : ట్రంప్ ఝలక్.. భారీగా తగ్గిన బంగారం ధర..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd