Bigg Boss: బిగ్ బాస్ దాడి ఘటనలో 16 మంది అరెస్ట్
- Author : Balu J
Date : 21-12-2023 - 5:36 IST
Published By : Hashtagu Telugu Desk
Bigg Boss: తెలుగు బిగ్ బాస్ సీజన్-7 ఫైనల్ చర్చనీయాంశమవుతున్న తెలిసిందే. ఇప్పటికే బిగ్ బాస్ విన్నర్ ను పోలీసులు అరెస్ట్ చేయగా, తాజాగా మరో 16 మందిని అరెస్ట్ చేశారు. బిగ్‌బాస్ ఫైనల్ తర్వాత కొందరు ఆర్టీసీ బస్సులు, పోలీసు వాహనాలపై దాడి చేశారు. ఈ ఘటనలోనే 16 మందిని గుర్తించిన జూబ్లీహిల్స్ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వీరిలో 12 మంది మేజర్లు కాగా.. నలుగురు మైనర్లు ఉన్నారు. ఇక బిగ్‌బాస్-7 ఫైనల్ తర్వాత విన్నర్ ప్రశాంత్ బయటకు రాగా.. అభిమానులు భారీగా స్వాగతం పలికారు.
అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్ సైతం బయటకు రాగా.. ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అమర్‌దీప్‌పై పలువురు రాళ్లు విసిరే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనలో అతడి కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. మరో కంటెస్టెంట్ అశ్విని కారు అద్దాలను కూడా దుండగులు ధ్వంసం చేశారు. అలాగే రోడ్డుపై వెళ్తున్న ఆరు ఆర్టీసీ బస్సుల అద్దాలను పగలగొట్లారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అరెస్ట్ లకు దిగారు.