Ghaziabad: కుక్క కరిచిన విషయం దాచిన బాలుడు.. చివరికి రేబిస్ తో మృతి
ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. కుక్క కాటుకు గురైన 14 సంవత్సరాల బాలుడు రేబిస్ వ్యాధిబారీన పడ్డాడు. చివరకి మృతి చెందాడు
- By Praveen Aluthuru Published Date - 03:33 PM, Wed - 6 September 23

Ghaziabad: ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. కుక్క కాటుకు గురైన 14 సంవత్సరాల బాలుడు రేబిస్ వ్యాధిబారీన పడ్డాడు. చివరకి మృతి చెందాడు. ఘజియాబాద్ లోని విజయనగరంలో యాకూబ్ కుటుంబం నివసిస్తుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి యాకుబ్ కొడుకు వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అన్నం తినకుండా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడట.కొన్ని సార్లు కుక్కలా మొరిగినట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆ వెంటనే అతని శరీరంలో ఇన్ఫెక్షన్ రావడం మొదలైంది. బాలుడి పరిస్థితిని చూసిన కుటుంబ సభ్యులు వైద్యులకు చూపించగా.. కొంతకాలం క్రితం కుక్క కాటుకు గురైయ్యాడని తేలింది. కుక్క కాటు ఇన్ఫెక్షన్ మొత్తం శరీరానికి వ్యాపించింది, దాని కారణంగా అతనికి ఈ పరిస్థితి వచ్చింది. నెలన్నర క్రితం కుక్క కరిచిందని, ఆ చిన్నారి భయంతో ఇంట్లో చెప్పలేదని చివరికి నిర్ధారణ అయింది. నిస్సహాయ తండ్రి కొడుకుని ఎన్నో ఆస్పత్రులకు తిప్పాడు. పెద్ద ఆసుపత్రులు కూడా చేతులు ఎత్తేశాయి. చివరగా బులంద్‌షహర్‌లోని ఆయుర్వేద వైద్యుడి వద్దకు వెళ్లమని ఎవరో సలహా ఇస్తే అతని దగ్గరకు బాలుడిని తీసుకుని వెళ్తుండగా తండ్రి ఒడిలోనే బాలుడు కన్నుమూశాడు.
Also Read: SRK and Mahesh: మహేశ్ మీతో కలిసి జవాన్ మూవీ చూడాలనుకుంది, షారుక్ ఇంట్రస్టింగ్ ట్వీట్!