Nude Dance: ఏపీలో నగ్న నృత్యాలు..10మంది అరెస్ట్
తూర్పుగోదావరి జిల్లా ఉప్పంగళ గ్రామంలో జరిగిన జాతరలో ‘నగ్న నృత్యాలు’ నిర్వహించిన
- Author : Balu J
Date : 16-04-2022 - 11:31 IST
Published By : Hashtagu Telugu Desk
తూర్పుగోదావరి జిల్లా ఉప్పంగళ గ్రామంలో జరిగిన జాతరలో ‘నగ్న నృత్యాలు’ నిర్వహించిన 10 మందిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన ఏప్రిల్ 14, 15 మధ్య రాత్రి తెల్లవారుజామున ఆశ్లీల డాన్సులు చేస్తున్నట్టు, ఈ మేరకు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం ఉప్పంగళ గ్రామంలో పోలేరమ్మ జాతర (జాతర)లో ‘నగ్న నృత్యాలు నిర్వహించిన 10 మందిని కోరింగ పోలీస్ స్టేషన్‌లో వైరల్ వీడియో ఆధారంగా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో మాకు తెలియదు, త్వరలో అన్ని వివరాలను తెలియజేస్తామని పోలీసులు వెల్లడించారు.