Kerala Bomb Blast: కేరళలోని క్రిస్టియన్ సెంటర్ లో బాంబు పేలుళ్లు
కేరళలో పేలుళ్లు కలకలం రేపాయి. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో ఈ రోజు ఆదివారం బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఎర్నాకుళంలో జిల్లాలోని కలమస్సేరిలోని కన్వెన్షన్ సెంటర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
- By Praveen Aluthuru Published Date - 11:44 AM, Sun - 29 October 23

Kerala Bomb Blast:కేరళలో పేలుళ్లు కలకలం రేపాయి. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో ఈ రోజు ఆదివారం బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఎర్నాకుళంలో జిల్లాలోని కలమస్సేరిలోని కన్వెన్షన్ సెంటర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ పేలుడు చోటు చేసుకుంది.
ఉదయం 9 గంటల ప్రాంతంలో పేలుడు గురించి ఫోన్ వచ్చిందని పోలీసులు తెలిపారు. కన్వెన్షన్ సెంటర్ లోపల పేలుడు సంభవించిన విజువల్స్ హాల్ లోపల మంటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక్కసారిగా పేలుడు జరగడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. కన్వెన్షన్ సెంటర్ వెలుపల వందలాది మంది కనిపించారు.అంచనా ప్రకారం పేలుళ్లు జరిగిన సమయంలో ఈ కన్వెన్షన్ సెంటర్ లో 2 వేల మంది ఉన్నారు. కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన మూడు పేలుళ్లతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. కాగా గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సహాయక చర్యలు జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: 12 Cards For Voting : ఓటరు ఐడీ దొరకకపోతే.. ఈ 12 కార్డులతోనూ ఓటు వేయొచ్చు