World AIDS Day 2023 : పులిరాజా సేఫ్‌గా ఉన్నాడా ? లేడా ?
World AIDS Day 2023 : డిసెంబరు 1.. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. HIV లేదా AIDS దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధి.
- By Pasha Published Date - 08:55 AM, Fri - 1 December 23

World AIDS Day 2023 : డిసెంబరు 1.. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. HIV లేదా AIDS దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా 3.9 కోట్ల మంది HIVతో ఇబ్బందిపడుతున్నారు. హెచ్ఐవీ, ఎయిడ్స్ నయం కానీ ఓ దీర్ఘకాలిక వ్యాధి. కానీ జీవనశైలిలో మార్పులు.. మెడిసిన్‌తో దీనిని కంట్రోల్ చేయవచ్చు. ఈ నేపథ్యంలో దీనిపై అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం. నేటికీ చాలామందికి హెచ్‌ఐవీ, ఎయిడ్స్ మధ్య వ్యత్యాసం తెలియదు. ఈ వ్యాధి గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటో చూద్దాం..
We’re now on WhatsApp. Click to Join.
ఎయిడ్స్ గురించి ముఖ్యమైన అంశాలు..
- HIV అనేది ఒక వైరస్. దీన్ని హ్యూమన్ ఇమ్యునో డెఫీషియెన్సీ వైరస్ అని కూడా అంటారు.
- హెచ్‌ఐవీ వైరస్ సోకినప్పుడు ఎవరైనా ఎయిడ్స్ బారినపడొచ్చు.
- ఎయిడ్స్‌కు ప్రధాన కారణం అసురక్షితమైన సెక్స్.
- సెక్స్ వర్కర్లు, బైసెక్సువల్ ప్రజలకు ఎయిడ్స్ రిస్క్ ఎక్కువ.
- తల్లికి ఎయిడ్స్ ఉన్నట్లయితే.. ప్రసవ సమయంలో లేదా తల్లి పాల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
- వైరస్ ఉన్న వ్యక్తికి వినియోగించిన ఇంజెక్షన్లు మరొకరికి ఉపయోగించడం వల్ల కూడా వైరస్ వ్యాప్తి జరుగుతుంది.
- హెచ్‌ఐవీతో బాధపడుతున్న ప్రతి వ్యక్తికి ఎయిడ్స్ రాదనేది నిజం. కానీ చికిత్స లేకుంటే హెచ్‌ఐవీ ఎయిడ్స్‌కు దారి తీస్తుంది.
- HIV మీ శరీరంలోని రోగనిరోధక కణాలకు సోకి, వాటిని నాశనం చేస్తుంది. దీనివల్ల మీ రోగ నిరోధక వ్యవస్థ ఇతర వ్యాధులతో పోరాడటం కష్టతరం అవుతుంది.
- HIV మీ రోగనిరోధక శక్తిని పూర్తిగా బలహీనపరిచినప్పుడు.. ఆ స్థితినే ఎయిడ్స్ అంటారు.
- ఎయిడ్స్‌తో బాధపడేవారిలో తెల్ల రక్తకణాలు చాలా తక్కువగా ఉంటాయి. వారి రోగనిరోధక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని ఉంటుంది.
- హెచ్‌ఐవీ వైరస్ సోకిన తర్వాత.. ఎయిడ్స్‌లో మూడు దశలు ఉంటాయి. మొదటిదశ తీవ్రమైన HIV, రెండో దశ క్రానిక్ స్టేజ్, మూడోదశ ఎయిడ్స్.
హెచ్ఐవీ యాంటీబాడీ టెస్ట్
హెచ్ఐవీ యాంటీబాడీ టెస్ట్ కోసం రక్తం, లాలాజలంలను సేకరిస్తారు. దీని ద్వారా హెచ్ఐవీ సంక్రమణకు ప్రతిస్పందనగా రోగ నిరోధక వ్యవస్థ ద్వారా ఉత్పత్తి చేసిన ప్రతిరోధకాలు గుర్తిస్తారు. .
యాంటీజెన్ టెస్ట్
యాంటీజెన్ టెస్ట్ ద్వారా మీ శరీరంలోని యాంటీబాడీస్, వైరల్ యాంటిజెన్‌ను గుర్తిస్తారు.
న్యూక్లియిక్ యాసిడ్ టెస్ట్
న్యూక్లియిక్ యాసిడ్ టెస్ట్.. వైరస్‌ను నేరుగా గుర్తించే బ్లడ్ టెస్ట్. వైరస్ ప్రభావం తక్కువగా ఉన్నప్పుడు.. ప్రారంభ దశలోనే గుర్తించడానికి ఇది దోహదం చేస్తుంది. CD కౌంట్, వైరల్ లోడ్ టెస్ట్ వంటి టెస్ట్‌లు కూడా హెచ్ఐవీని గుర్తించడంలో(World AIDS Day 2023) హెల్ప్ చేస్తాయి.