Sign Languages Day : భాష రాకున్నా భావం భళా.. ఇవాళ సంకేత భాషా దినోత్సవం
Sign Languages Day : ఈరోజు అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం.
- By Pasha Published Date - 09:34 AM, Sat - 23 September 23

Sign Languages Day : ఈరోజు అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం. మనం ఎవరికైనా ఏదైనా విషయం చెప్పాలంటే ఒక భాషలో మాట్లాడాలి. ఆ భాషను వినాలి. ఇటువంటి పరిస్థితుల్లో మాట్లాడలేని, వినలేని బధిరులు ఎలా కమ్యూనికేట్ చేయాలి ? అందుకే వారికి సమాచారాన్ని అర్థమయ్యే రీతిలో అందించేందుకు ఆవిర్భవించిందే సంకేత భాష (sign language). బాడీ లాంగ్వేజ్, శరీర కదలికలు, కనుబొమ్మలను కదపడం, ముఖ కవళికల ద్వారా ఎదుటి వ్యక్తితో సంభాషణ చేసే నైపుణ్యాన్ని సంకేత భాష అందిస్తుంది. వేళ్లు లేదా చేతి సంజ్ఞల ద్వారా మనసులోని భావాలను వివరిస్తుంది.
ప్రతి సంకేతంలో ఐదు అంశాలు
ప్రతి సంకేతంలో ఐదు అంశాలుంటాయి. వాటిలో ఒక్కటి మారినా, మొత్తం అర్థం మారిపోతుంది. చేతి కదలికలో వచ్చే చిన్న తేడా కూడా మొత్తం అర్థాన్ని మార్చగలదు. ఒకే చేతి నుంచి వచ్చే రెండు ఒకే రకమైన సంకేతాలకు కూడా అంశాలను బట్టి అర్థం వేరే ఉంటుంది. వరల్డ్ లో చాలా సంకేత భాషలు ఉన్నాయి. వాటిపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ‘‘బధిరులు, చెవిటివారు, మూగవారు సంకేత భాషలను తెలుసుకోవాలి. అది వారి హక్కు’’ అంటూ ఐక్యరాజ్యసమితి సంకేత భాషల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది.
Also read : I Am With CBN : జెనెక్స్ కార్ షోరూంలో వైసీపీ నేతలకు సేల్స్& సర్వీస్ నిలిపివేత.. కారణం ఇదే..?
ప్రపంచ బధిరుల సంఘం 1951 సెప్టెంబర్ 23న ఏర్పడింది. అయితే ఈ సంఘం ఏర్పడిన చాలా దశాబ్దాల తర్వాత 2018 సెప్టెంబర్ 23న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మొదటిసారిగా అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ సంవత్సరం అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవం యొక్క థీమ్ ‘‘A World Where Deaf People Everywhere Can Sign Anywhere’’. బధిరులు ఎవరితోనైనా, ఎక్కడైనా సంకేతాల సహాయంతో కమ్యూనికేట్ చేయగల ప్రపంచం అని దీని అర్థం. ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల మందికిపైగా బధిరులు ఉన్నారని అంచనా. వారు 300కు పైగా సంకేత భాషల్ని (Sign Languages Day) భావ వ్యక్తీకరణ అవసరాల కోసం వాడుతున్నారు. కొన్ని న్యూస్ ఛానెళ్లు కూడా బధిరుల కోసం ప్రత్యేక బులిటెన్లు ఇస్తున్నాయి.