I Am With CBN : జెనెక్స్ కార్ షోరూంలో వైసీపీ నేతలకు సేల్స్& సర్వీస్ నిలిపివేత.. కారణం ఇదే..?
- By Prasad Published Date - 08:56 AM, Sat - 23 September 23

హైదరాబాద్ మాదాపూర్ జెనెక్స్ షోరూంలో వైసీపీ నేతలకు సేల్స్ మరియు సర్వీస్‌లు నిలిపివేస్తున్నట్లు షోరూం యాజమాని అమర్ తెలిపారు. దీనికి కారణం చంద్రబాబును వైసీపీ నేతలు అక్రమంగా కేసులు పెట్టి వేధించడమేనని ఆయన తెలిపారు. ఆయన మాదాపూర్‌లో 2005లో జెనెక్స్ షోరూం ఏర్పాటు చేశానని.. ఆ ఏరియాలో ఆ నాడు చంద్రబాబుగారు వేసిన రోడ్లు, కంపెనీల వల్ల అభివృద్ధి చెందిందని..ఆ నాడు ఆయన చేసిన అభివృద్ధితో 20 ఏళ్లుగా తన వ్యాపారం మంచిగా సాగుతుందని తెలిపారు. తన వ్యాపార ఎదుగుదలకు కృషి చేసిన చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. అందుకోసం వైసీపీ వాళ్లకు తన జెనెక్స్ షోరూంలో సేల్స్, సర్వీస్ నిలిపివేస్తున్నానని తెలిపారు.తన వ్యాపారం తగ్గిపోయిన పర్వాలేదని.. తనకు చంద్రబాబు మీద ఉన్న అభిమానంతో ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. మాదాపూర్ జెనెక్స్ షోరూం ముందు ఐయామ్ విత్ బాబు ఫ్లెక్సీ కట్టి.. వైసీపీ నేతలకు సర్వీస్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై గ్రామ స్థాయి నుంచి దేశ, విదేశాల్లో ఉన్న వారంతా ఖండిస్తున్నారు. 74 ఏళ్ల వయసులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్వాంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి చేసిన ఆయన్ని స్కాం కేసుల్లో ఇరికించారని ప్రజలు మండిపడ్డారు. స్వచ్ఛంధంగా ప్రజలు చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నారు. ఇటు హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు గచ్చిబౌలి, సైబర్ టవర్స్, కేపీహెచ్‌బీ, మణికొండ, ఔటర్ రింగ్‌రోడ్డుపై ఆందోళనలు నిర్వహించారు. ఐటీ అభివృద్ధికి కారణం చంద్రబాబేనని..ఈ రోజు తాము ఈ స్థాయిలో ఉన్నామంటే ఆయన చేసిన ఐటీ అభివృద్ధి వల్లేనని వారు తెలిపారు. ఆయనకు సంఘీభావంగా ఆందోళనలు చేస్తున్నారు. వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు.