Virender Sehwag: సెల్యూట్ సెహ్వాగ్, ఒడిశా ప్రమాదంలో అనాథైన పిల్లలకు ఉచిత విద్య!
- By Balu J Published Date - 06:29 PM, Mon - 5 June 23

దేశంలోని అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఒడిశా ప్రమాదం ఒకటి. ఈ విషాదంలో వందలాది మంది పిల్లలు అనాథలు అయ్యారు. అయితే వీరి బాగోగులు చూసుకునేందుకు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా దిగ్గజ టీమిండియా క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల బాధ్యతలు తీసుకుంటానని ప్రకటించాడు. వీరందరికీ ఉచిత విద్య అందిస్తానని ట్వీట్ చేశాడు.
ప్రమాదం గురించి సెహ్వాగ్ ఒక ట్వీట్ చేశాడు. ప్రమాదానికి సంబంధించిన ఫోటోను షేర్ చేసి.. ‘ఈ ఇమేజ్ చాలా కాలం పాటు మనల్ని వెంటాడుతుంది’ అని క్యాప్షన్ పోస్ట్ చేశాడు. ‘ఈ విషాద ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లలకు విద్యను అందించడమే నేను చేయగలిగింది. ఈ పిల్లలకు సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ బోర్డింగ్ ఫెసిలిటీలో ఉచిత విద్య అందిస్తాను.’ అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. దీంతో ఈ లెజెండరీ క్రికెటర్ నిర్ణయంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: KCR Strategy: కేసీఆర్ మైండ్ గేమ్.. ప్రత్యర్థిని తేల్చేసిన గులాబీ బాస్!